రాజమౌళి తల్లి.. మా చిరంజీవి అనడం వెనుక ఇంత క‌థ ఉందా..?

Authored By vamana sai | The Telugu News | Updated on : 3 June 2021, 7:00 am

Vijayendra prasad : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి లాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలకి అభిమానులు లెక్కకు మించి ఉన్నారు. ఆయన తీసే ప్రతీ సినిమాకి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తారనే విషయం తెలిసిందే. కొడుకు సినిమాలకి మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ లాంటి వాళ్ళకి పాన్ ఇండియన్ స్థాయిలో కథ కూడా అందించి తన సత్తా ఏంటో చూపించారు. కొడుకు రాజమౌళి తో పాటు తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా పాన్ ఇండియన్ రైటర్‌గా క్రేజ్ తెచ్చుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో విచ్చేసిన విజయేంద్ర ప్రసాద్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని ఈ సినిమాకి ఆమె వెన్నుముక అని తెలిపిన ఆయన ఎన్.టి.ఆర్, చరణ్ మధ్య ఓ అద్భుతమైన యాక్షన్ సీన్ ఉంటుందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని సినిమా చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుంటే తల్లికి ఎంత బాధ కలుగుతుందో చరణ్, తారక్ మధ్య ఫైట్ వచ్చినప్పుడు అభిమానులు అదే ఫీలవుతారని వెల్లడించారు.

Vijayendra prasad

Vijayendra prasad

Vijayendra prasad : ఆ రకంగా చిరంజీవి పరోక్షంగా రాజమౌళి తల్లి కాస్ట్ బయట పడటానికి కారణం అయ్యారు.

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ ది లవ్ మ్యారేజ్ అని తెలిపారు. అయితే ఆయన పెళ్ళి చేసుకున్న ఆవిడ కాస్ట్ గురించి ఏరోజు తనతో ప్రస్తావించలేదని చెప్పారు. అయితే ఓ సందర్భంలో చిరంజీవికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ..ఆయన భార్య ..మా చిరంజీవి అని సంబోధించారట. మా చిరంజీవి ఏంటీ అన్నప్పుడు మా కాపులే కదా చిరంజీవి అంటూ తను కాపులనే విషయాన్ని చెప్పకనే చెప్పారట. ఈ రకంగా చిరంజీవి పరోక్షంగా రాజమౌళి తల్లి కాస్ట్ బయట పడటానికి కారణం అయ్యారు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ వెల్లడించిన ఈ ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> NTR : ఎన్.టి.ఆర్ పొల్టికల్ ఎంట్రీ ఇలా జరగనుందా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> జూన్ 7 నుంచి ఆనంద‌య్య మందు పంపిణీ.. ఈ వెబ్ సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ఇది కూడా చ‌ద‌వండి ==> Pooja hegde : పూజా హెగ్డే లేటెస్ట్ హాట్ ఫొటో షూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆనందయ్య మందు కంట్లోనే ఎందుకు వేస్తున్నాడు… ఆయుష్ సీఎంవో కామేశ్వరావు చెప్పిన షాకింగ్ నిజాలు..!

Advertisement

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి