Rajendra Prasad : రేయ్.. నువ్వు పెద్ద దొంగ అంటూ అంత పెద్ద క్రికెట‌ర్‌ని రాజేంద్ర ప్ర‌సాద్ అలా అన్నాడేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajendra Prasad : రేయ్.. నువ్వు పెద్ద దొంగ అంటూ అంత పెద్ద క్రికెట‌ర్‌ని రాజేంద్ర ప్ర‌సాద్ అలా అన్నాడేంటి?

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Rajendra Prasad : రేయ్.. నువ్వు పెద్ద దొంగ అంటూ అంత పెద్ద క్రికెట‌ర్‌ని రాజేంద్ర ప్ర‌సాద్ అలా అన్నాడేంటి?

Rajendra Prasad : హీరో క‌మ్ క‌మెడీయ‌న్ రాజేంద్ర ప్ర‌సాద్ త‌న సినిమాల‌తో ప్రేక్షకుల‌ని ఎంత‌గా అల‌రించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు హీరోగా అల‌రించిన ఆయ‌న ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో రాజేంద్ర ప్ర‌సాద్ కూడా కీల‌క పాత్ర పోషించారు.

Rajendra Prasad రేయ్ నువ్వు పెద్ద దొంగ అంటూ అంత పెద్ద క్రికెట‌ర్‌ని రాజేంద్ర ప్ర‌సాద్ అలా అన్నాడేంటి

Rajendra Prasad : రేయ్.. నువ్వు పెద్ద దొంగ అంటూ అంత పెద్ద క్రికెట‌ర్‌ని రాజేంద్ర ప్ర‌సాద్ అలా అన్నాడేంటి?

Rajendra Prasad ఏంద‌య్యా ఆ భాష‌..

అయితే రాబిన్ హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం విశేషం. కాగా, డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. స్టేజ్ పైనే అందరి ముందే.. డేవిడ్ వార్నర్ ని తిట్టేశారు రాజేంద్ర ప్రసాద్. రేయ్ అంటూ వార్నర్ ను సంబోధించారాయన. అంతేకాదు క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. నువ్వు పెద్ద దొంగ.. మామూలోడు కాదండి వీడు.. అంటూ వ్యాఖ్యానించారు.

రాజేంద్ర ప్ర‌సాద్ స‌ర‌దాగానే మాట్లాడిన ఆయ‌న వ్యాఖ్య‌ల‌కి కొంద‌రు నొచ్చుకున్నారు. తాగి వ‌చ్చి అలా మాట్లాడాడా అని చ‌ర్చించుకుంటున్నారు. రాబిన్ హుడ్ సినిమా హాయిగా ఫ్యామిలీతో ఏసీ థియేటర్ లో కూర్చుని చూసే సినిమా. చాలాకాలం తర్వాత మంచి సినిమాలో కామెడీతో సహా చూసే అదృష్టం మీకు కలిగింది. అలా మీకు కలగటానికి కారణం వెంకీ కుడుముల అని రాజేంద్ర ప్ర‌సాద్ అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది