Rajendra Prasad : నేను అలానే మాట్లాడతా.. అర్ధం చేసుకోపోతే మీ ఖర్మ అన్న రాజేంద్రప్రసాద్
ప్రధానాంశాలు:
Rajendra Prasad : నేను అలానే మాట్లాడతా.. అర్ధం చేసుకోపోతే మీ ఖర్మ అన్న రాజేంద్రప్రసాద్
Rajendra Prasad : సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తీవ్ర పదజాలంతో ఆలీపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చర్చనీయాంశంగా మారారు. తన వ్యాఖ్యలను తప్పుబడుతుండడం పట్ల రాజేంద్రప్రసాద్ తాజాగా వివరణ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్, తాను ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తినని స్పష్టం చేశారు.

Rajendra Prasad : నేను అలానే మాట్లాడతా.. అర్ధం చేసుకోపోతే మీ ఖర్మ అన్న రాజేంద్రప్రసాద్
Rajendra Prasad : ఇలా చేస్తున్నాడేంటి ?
సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టినరోజైన జూన్ 2న ఈ సక్సెస్ మీట్ జరగడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్ అన్నారు. “ఆయనకు నేనంటే ఎంతో అభిమానం, ప్రేమ. ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో నేను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. వాటిని తప్పుగా అర్థం చేసుకోవడం మీ ఖర్మ. నేనైతే ఇలానే ఎప్పుడూ సరదాగానే ఉంటాను అని అన్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో తాను పరిచయం చేసిన హీరోయిన్, నటుడి గురించి సరదాగా మాట్లాడిన మాటలను కూడా తప్పుగా చిత్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. పెళ్లిపుస్తకం నుంచి షష్టిపూర్తి వరకూ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగడం ఇండస్ట్రీలో ఏ నటుడికి దక్కని అరుదైన అవకాశం. మీ అందరూ ఈ సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.