Affair : చెల్లెలు భర్తతో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వదల్లేదుగా..!
ప్రధానాంశాలు:
Affair : చెల్లెలు భర్తతో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వదల్లేదుగా..!
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్‌లో ఓప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ప్రేమ వ్యవహారం – రాజేష్ ఖన్నా మరియు సింపుల్ కపాడియా మధ్య సంబంధమే. సింపుల్ కపాడియా, బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా సోదరి. ఆమె 1977లో “అనోఖీ అదా” అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.

Affair : చెల్లెలు భర్తతో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వదల్లేదుగా..!
Affair అలా జరిగింది..
మొదటి సినిమాలోనే అప్పటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా సరసన నటించడం, ఆమెకు గొప్ప అవకాశం అయింది. ఆ తర్వాత “జమానే కో దిఖానా హై”, “చక్రవ్యూహ్”, “లూటమార్” వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.అయితే, 1985లో నటనకు వీడ్కోలు పలికిన సింపుల్, ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మళ్లారు. ఈ రంగంలోనూ ఆమె తనదైన ముద్ర వేసారు.
ఇదిలా ఉండగా, సినీరంగంలో గుసగుసల ప్రకారం రాజేష్ ఖన్నా మరియు సింపుల్ కపాడియా మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. డింపుల్ కపాడియాతో రాజేష్ ఖన్నా వివాహం తర్వాత కూడా, ఆయనకు సింపుల్‌తో సంబంధం కొనసాగినట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇది డింపుల్, రాజేష్ మధ్య విభేదాలకు కారణమైందని, చివరికి వారి విడాకులకు దారితీసిందని అప్పట్లో బాలీవుడ్‌లో చాలామంది అనుకున్నారు.
సింపుల్ కపాడియా సినీరంగం నుంచి తప్పుకున్న తర్వాత, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ మొదలుపెట్టి, మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ 2006లో ఆమెకు క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో, ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. అనారోగ్యంతో పోరాడుతూ, 2009లో కేవలం 51 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టారు.