Rajinikanth : వైసీపీ నేతలతో యుద్ధానికి సిద్ధమైన రజినీకాంత్.. వాళ్లను ఎందుకు టార్గెట్ చేసినట్టు..?
Rajinikanth : టైటిల్ చూసి షాకయ్యారా? అసలు రాజకీయాలకు, రజినీకాంత్ కు ఏంటి సంబంధం. ఆయన ఎందుకు రాజకీయాల్లో వేలుపెడుతున్నారు. రాజకీయాలు అంటేనే ఆయన పెద్దగా పట్టించుకోరు కదా. అది కూడా వైసీపీ నేతలను ఎందుకు టార్గెట్ చేసినట్టు అని అనుకుంటున్నారా? దానికి కారణం ఉంది. అసలు విషయం ఏంటంటే.. రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ ఈనెల 10న విడుదల కాబోతోంది. దాని కోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ దాదాపు గంట సేపు మాట్లాడారు. ఆయన మాటల్లో ఎక్కువగా రాజకీయాల గురించే చర్చ నడిచింది. వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన వైసీపీ నేతలనే టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది. అర్థమైందా రాజా.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల గురించే అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండు జరగని ఊరు లేదు.. అవన్నీ మనం పట్టించుకుంటామా.. అయినా మనం పట్టించుకోవద్దు.
rajinikanth indirect counter to ysrcp leaders
Rajinikanth : మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు
ఇవన్నీ పట్టించుకోకుండా మన పని చూసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి. అర్థమైందా రాజా.. అంటూ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు రజినీకాంత్. అసలు రజినీకాంత్ కు, వైసీపీకి మధ్య ఎక్కడ చెడింది అంటే.. అది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ద్వారా జరిగిందనే చెప్పుకోవాలి. చంద్రబాబు ఆయన్ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను గెస్ట్ గా పిలిచారు. ఆ ఈవెంట్ లో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు రజినీ. అప్పటి నుంచి వైసీపీ నేతలు.. రజినీకాంత్ ని కూడా టార్గెట్ చేశారు. రోజా, కొడాలి నాని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అందుకే వాళ్లకు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు రజినీ.
She: Show me instant goosebumps and motivation.
Me: Watch this… ????????????????????????#Rajinikanth???? #Prabhas pic.twitter.com/EmNS1Kx5QC— Tharun teja__Saaho (@Mr_inn0cent_) August 8, 2023