Rashmi : ఆయన మధ్యవర్తిత్వంతో ఒక్కటి.. మొత్తానికి ఏకమైన రష్మీ సుధీర్
Rashmi : బుల్లితెరపై రష్మీ సుధీర్ చేసిన మాయాజాలం అందరికీ తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏమీ లేకపోయినా సరే ఏదో ఉన్నట్టు కెమిస్ట్రీని పండిస్తుంటారు. అలాంటి రష్మీ సుధీర్ తెరపై నిజమైన ప్రేమికుల జంటగానే కనిపిస్తారు. తెరపైకి వచ్చే సరికి ఇద్దరూకూడా తమ తమ పాత్రల్లో జీవిస్తుంటారు. అయితే తెర వెనుక మాత్రం ఇద్దరూ మంచి స్నేహితుల్లానే ఉంటారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రష్మీ […]
Rashmi : బుల్లితెరపై రష్మీ సుధీర్ చేసిన మాయాజాలం అందరికీ తెలిసిందే. గత ఎనిమిదేళ్లుగా రష్మీ సుధీర్ బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏమీ లేకపోయినా సరే ఏదో ఉన్నట్టు కెమిస్ట్రీని పండిస్తుంటారు. అలాంటి రష్మీ సుధీర్ తెరపై నిజమైన ప్రేమికుల జంటగానే కనిపిస్తారు. తెరపైకి వచ్చే సరికి ఇద్దరూకూడా తమ తమ పాత్రల్లో జీవిస్తుంటారు. అయితే తెర వెనుక మాత్రం ఇద్దరూ మంచి స్నేహితుల్లానే ఉంటారు.
తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రష్మీ సుధీర్ ఒక్కటయ్యారు. దానికి రాకేష్ మాస్టర్ మధ్య వర్తత్వం వహించాడు. ఈ మధ్య రాకేష్ మాస్టర్ జబర్దస్త్ షోలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే స్కిట్‌లో భాగంగా రష్మీ సుధీర్‌లను ఒక్కటి చేసేశాడు. స్కిట్‌లో భాగంగా సుధీర్ రాకేష్ మాస్టర్ వద్దకు వస్తాడు. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అంటూ సుధీర్‌ను రాకేష్ మాస్టర్ అడుగుతాడు. దానికి సుధీర్ సమాధానమిస్తూ రష్మీని ఇరికిస్తాడు.
Rashmi : మొత్తానికి ఏకమైన రష్మీ సుధీర్
నేను ఎవ్వరినీ ప్రేమించడం లేదు.. కానీ నా వెనకే ఓ అమ్మాయి పడుతుందని రష్మీని పరోక్షంగా చూపిస్తాడు. రోజా గారు నేను వెంటపడ్డానా? అని రష్మీ అడుగుతుంది. ఆ సందర్భంలో వారిద్దరూ కలిసి చేసిన పెళ్లి ఈవెంట్లను గుర్తు చేశారు. ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు కదా? అని సుధీర్‌ను రాకేష్ మాస్టర్ ప్రోత్సహించాడు. అదే సమయంలో సుధీర్ తెగ సిగ్గుపడిపోయాడు. నీకు ఇష్టమేనా? అని రష్మీని అడిగితే ఇష్టమే మాస్టర్ అని సమాధానం ఇచ్చింది. అలా రష్మీ సుధీర్‌ను రాకేష్ మాస్టర్ ఒక్కటి చేసేశాడు.