Rakul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ ‘ చెక్ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అందుకే రాలేదు ..షాక్ లో నితిన్ ..?
Rakul preet singh : రకుల్ ప్రీత్ సింగ్ చెక్ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించాడు. మరో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. ఈ వారమే చెక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని పీక్స్ లో నిర్వహిస్తున్నారు. ఏ సినిమాకైన ప్రమోషన్స్ చాలా ముఖ్యం. ఆ ప్రమోషన్స్ కి హీరో, హీరోయిన్ హాజరవడం చాలా అవసరం.
రీసెంట్ గా చెక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్. నితిన్ .. ప్రియా ప్రకాష్ వారియర్ తో సహా చిత్ర యూనిట్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఛీఫ్ గెస్ట్ గా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి .. మరో గెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హాజరయ్యారు. అయితే ఇంత పెద్ద ఈవెంట్ కి మేయిన్ హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం హాజరవలేదు. సెకండ్ హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఈవెంట్ లో సెంటరాఫ్ అట్రాక్షన్స్ గా నిలిచింది.
Rakul preet singh : చెక్ సినిమాకి సంబంధించిన ఏ ఫంక్షన్ కైనా హాజరవుతానని నితిన్ కి చెప్పినట్టు సమాచారం.
దాంతో నితిన్ ఫ్యాన్స్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారట. రకుల్ ఈవెంట్ లో కనపడనందుకు నితిన్ కూడా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. అయితే రకుల్ ప్రీత్ చెక్ ఈవెంట్ కి రాకపోవడానికి కారణం హింది సినిమాలతో బిజిగా ఉండటమే. అక్కడ వరసగా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్లే చెక్ ఈవెంట్ కి రాలేదట. అయితే వీలును బట్టి ఇకపై చెక్ సినిమాకి సంబంధించిన ఏ ఫంక్షన్ కైనా హాజరవుతానని నితిన్ కి చెప్పినట్టు సమాచారం.