పొట్టి గౌనులో రకుల్.. ఆ అందం అదుర్స్

Authored By Cinema Desk | The Telugu News | Published on: May 30, 2021, 8:00 pm

రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలతో నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది. ప్రతీ రోజూ ఏదో ఒక పోస్ట్‌తో తన ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. అయితే రకుల్ ప్రీత్ ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటారు. ఎప్పుడూ ఆమె చుట్టూ ఏదో ఒక వివాదం తిరుగుతూనే ఉంటుంది. అలాంటి రకుల్ గురించి తెలియని విషయాలెన్నో ఉన్నాయి.

Rakul Preet Singh Latest Pic Goes Viral

Rakul Preet Singh Latest Pic Goes Viral

రకుల్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో సాధించింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. మోడల్‌గా దుమ్ములేపేశారు. ఇక చదువుల్లో రకుల్ ఎప్పుడూ ఫస్టే. ఇవన్నీ కాకుండా రకుల్ ఆటల్లో ఆరితేరిన అమ్మాయి. దేశ స్థాయిలో రకుల్ ఓ గోల్ఫ్ ప్లేయర్. ఈ విషయం చాలా మందికి తెలియదు. తాజాగా మళ్లీ గోల్ఫ్ ప్లేయర్ దుస్తుల్లో రకుల్ దర్శనమిచ్చింది. పొట్టి గౌను వేసుకుని కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.

Rakul Preet Singh Latest Pic Goes Viral

Rakul Preet Singh Latest Pic Goes Viral

ప్రస్తుతం రకుల్ ఓ మ్యాగజైన్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. హెచ్ టీ బ్రంచ్ అనే మ్యాగజైన్ కవర్ పేజీలో రకుల్ దర్శనమిచ్చింది. ఇందులో రకుల్ తన జీవితంలోని గోల్ఫ్ ఆడిన నాటి రోజుల గురించి చెప్పుకొచ్చింది. జీవితంలో ఎన్నో పాఠాలను గోల్ఫ్ ఆట నేర్పిందంటూ రకుల్ తెలిపింది. మొత్తానికి రకుల్ గోల్ఫ్ క్రీడాకారిణిగా అదరగొట్టేసింది. రకుల్ చేతిలో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలుప్రాజెక్ట్‌లున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp