Rakul Preet Singh : ఎత్తి అవతల పారేస్తోంది.. రకుల్ ప్రీత్ సింగ్ మామూల్ది కాదు
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. కానీ తెలుగులో రకుల్‌కు ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. రకుల్ అంతా కూడా బాలీవుడ్ మీదే ఫోకస్ పెట్టేసింది. బాలీవుడ్‌లో రకుల్ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే ఒక చిత్రం ఓటీటీలో వచ్చేసింది. అజయ్ దేవగణ్‌తో కలిసి రకుల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది.
అయితే రకుల్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వర్కవుట్లు మాత్రం మానడం లేదు. తాజాగా ఆమె వర్కవుట్లు చేసిన విధానం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అటాక్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ వర్కవుట్ వీడియోను రకుల్ షేర్ చేసింది. ఇందులో అటాక్ చాలెంజ్ అంటూ అందరినీ సవాల్ చేసింది.

Rakul Preet Singh Latest Workout Video
Rakul Preet Singh : రకుల్ అటాక్ చాలెంజ్..
ఇదే అటాక్ చాలెంజ్.. టైగర్ ష్రాఫ్, జాక్వెలిన్‌ను ఈ చాలెంజ్ స్వీకరించవల్సిందిగా సవాల్ విసురుతున్నాను. దీన్ని స్వీకరించి.. మిగతా వాళ్లకు విసరాలి.. అదిరిపోయే వర్కవుట్ వీడియోను షేర్ చేయండి.. అందరినీ ట్యాగ్ చేయండి.. అందులో బెస్ట్ వీడియోను నేను షేర్ చేస్తాను.. అంటూ రకుల్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ వీడియోలో రకుల్ పెద్ద పెద్ద టైర్లను లేపి అవతల పారేసింది.
View this post on Instagram