Ram Charan : దురదృష్టం అంటే నాదే .. మూడు సార్లు నేషనల్ అవార్డు మిస్సయ్యా .. రామ్ చరణ్ ఎమోషనల్
Ram Charan : మెగా అభిమానులు ఒకపక్క సంతోష పడుతుంటే మరోపక్క బాధపడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి చప్పట్లు కొడుతూనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితికి బాధపడుతున్నారు. అవార్డు వస్తుందన్న ప్రతిసారి రాంచరణ్ కి నేషనల్ అవార్డు మిస్ అవుతుంది అని గుర్తుతెచ్చుకుంటున్నారు. చెర్రీ లాంటి పర్ఫామెర్ కి అవార్డు రాకపోవడం పై బాధపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ను సంపాదించుకున్న రాంచరణ్ నేషనల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డును అందుకోలేకపోయారు.మూడు బ్లాక్ బస్టర్ సినిమాలతో నేషనల్ అవార్డు ను ఒకసారి కూడా అందుకోలేకపోయారు. 2008లో రాజమౌళి దర్శకత్వంలో ‘ మగధీర ‘ సినిమా చేసిన చెర్రీ ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న రాంచరణ్ ఆ సినిమాతో నేషనల్ అవార్డు అందుకుంటారని అందరూ అనుకున్నారు.
కానీ బెస్ట్ కొరియోగ్రాఫర్ , బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా నేషనల్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన ‘ రంగస్థలం ‘ సినిమా కూడా నేషనల్ అవార్డు వరకు వెళ్లింది. అయితే బెస్ట్ ఆడియోగ్రఫీ క్యాటగిరి కి మాత్రమే నేషనల్ అవార్డు దక్కించుకుంది.ఇక ఇటీవల వచ్చిన వరల్డ్ వైడ్ సినిమా ‘ ఆర్ఆర్ఆర్ ‘ కు రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డును ఇవ్వలేకపోయాయి. ఇలా రాంచరణ్ మూడుసార్లు నేషనల్ అవార్డును మిస్ చేసుకున్నారు.
ఏదేమైనా అల్లు అర్జున్ ‘ పుష్ప ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇది తెలుగు వారికి గర్వకారణం. తెలుగు హీరో జాతీయస్థాయిలో అవార్డు పొందడం తో అల్లు అర్జున్ అభిమానులు సంబరపడిపోతున్నారు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు అభిమానులు భారీ ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=TDPQ7nq0yOE