Ram Charan : రామ్ చరణ్ డు ఆర్ డై అంతా సినిమానే సెకండ్ ఆప్షన్ లేదట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : రామ్ చరణ్ డు ఆర్ డై అంతా సినిమానే సెకండ్ ఆప్షన్ లేదట..!

 Authored By ramesh | The Telugu News | Updated on :9 January 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Ram Charan : రామ్ చరణ్ డు ఆర్ డై అంతా సినిమానే సెకండ్ ఆప్షన్ లేదట..!

Ram Charan : గ్లోబల్ స్టార్ Global Star రామ్ చరణ్ Ram Charan నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. థమన్ Thaman మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్ ఇప్పటికే అదిరిపోయాయి. సినిమాలో అంజలి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది. శంకర్ సినిమాల్లో సోషల్ మెసేజ్ ఉంటుంది. గేమ్ ఛేంజర్ కూడా అలాంటి కథతో వస్తున్నట్టు తెలుస్తుంది.ఐతే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ Game Changer ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో మొదటిది చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ఒకవేళ రామ్ చరణ్ హీరో కాకపోతే ఏమవుతాడు అని.

Ram Charan రామ్ చరణ్ డు ఆర్ డై అంతా సినిమానే సెకండ్ ఆప్షన్ లేదట

Ram Charan : రామ్ చరణ్ డు ఆర్ డై అంతా సినిమానే సెకండ్ ఆప్షన్ లేదట..!

దానికి చరణ్ ఆన్సర్ అందరికీ షాక్ ఇచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణం వల్ల తనకు నటన మీద ఆసక్తి పెరిగిందని. ఇక తన ప్రొగ్రెస్ కార్డ్ మార్కులు చూసి నాన్న ఏమవుతావని అంటే సినిమాలు చేస్తా అన్నానని రామ్ చరణ్ అన్నారు.

Ram Charan :  మెగా హీరో ఆన్సర్ కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా..

ఐతే సినిమాలు కాకుంటే ప్లాన్ బి ఏమి లేదా అంటే లేదు డూ ఆర్ డై అన్నీ సినిమాలే అంటూ ఫిక్స్ అయ్యే దిగానని అన్నారు రామ్ చరణ్. మెగా హీరో ఆన్సర్ కి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. సో సినిమాలే తన జీవితం అది లేకపోతే ఏది లేదన్నట్టుగా చరణ్ చెబుతున్నాడు. ఏది ఏమైనా రామ్ చరణ్ అలా కమిట్ అయ్యాడు కాబట్టే సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు… సానబెట్టిన కత్తిలా సినిమా సినిమాకు తన నటనలో కూడా పరిణితి సాధిస్తూ 14 సినిమాలకే గ్లోబల్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. శంకర్ డైరెక్షన్ లో సినిమా కు ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా గేమ్ ఛేంజర్ వస్తుండగా సినిమా సూపర్ హిట్ కొడితే మెగా రికార్డులన్నీ తన పేరు మీద రాసుకునేలా చేస్తున్నాడు చరణ్. Ram Charan, Global Star, Thaman, Game Changer

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది