Ram Charan : ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్ టీజర్ విడుదల..!
Ram Charan కొరటాల శివ దర్శకత్వం లో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య సినిమాలో రామ్ చరణ్ Ram Charan కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమా విడుదలపూ మెగా అభిమానులు కాకుండా సినీ ఇండ్రస్టీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

ram charan teaser released from acharya movie
ఈ మూవీ మెగాస్టార్ కు జోడిగా కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ Ram Charan సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. అయితే నేడు ఈ సినిమా నుంచి మేకర్స్ రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో రామ్ చరణ్ సిద్ద అనే పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా చరణ్ ఒక నక్సలైట్ గా పాత్రలో నటిస్తున్నాడు. టీజర్‌లో ధర్మస్థలికి ఆపద వస్తే ఆ అమ్మోరుతల్లే మాలో ఆవహించి ముందుకు పంపుది అంటూ సిద్ద డైలాగ్ చెబుతాడు.
చెరువు దగ్గర చిరుత నీళ్లు తాగుతుంటే తల్లి చిరుత వెనుక ఉన్న విజువల్ చూపించారు. అచ్చం అలాగే చరణ్ నీళ్లు తాగుతుంటే.. చిరు చరణ్ వెనుక ఉన్న సీన్ చూపించారు. ఇక ఆచార్య మూవీ 2022 ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు మూవీ యునిట్ ప్రకటిచింది
