Ram Gopal Varma : గరికపాటి గడ్డిపరకతో సమానం.. తగ్గేదెలే అంటున్న రామ్ గోపాల్ వర్మ?
Ram Gopal Varma : : వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ్ మరోసారి రెచ్చిపోయాడు. మొన్నటివరకు సైలెంట్‌గాఉన్న ఆర్జీవీ ఒక్కసారిగా విజృంభించాడు. ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహరావుగారిని ఏకిపారేశారు. మెగాస్టార్ చిరంజీవి జోలికి వచ్చినా, ఆయన కుటుంబం జోలికి వచ్చినా అస్సలు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మెగా అభిమానిగా చూస్తూ ఊరుకోనని చెప్పారు. ఈ క్రమంలోనే గరికపాటిని విమర్శిస్తూ వరుసగా ట్వీట్స్ చేశాడు. రాంగోపాల్ వర్మ ఒక్కసారిగా ఎందుకు ట్వీట్ యుద్దం ప్రకటించాడో అర్థం కావడం లేదు. రీసెంట్ గా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహంచగా..
అక్కడకు గరికిపాటి నరసింహారావు గారు మాట్లాడేందుకు వచ్చారు. అదే ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. చిరుతో కలిసి జనాలు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించగా.. గరికపాటికి కోపం వచ్చి ఫోటో సెషన్ ఆపకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని మైకులో చెప్పడంతో చిరంజీవిని గరికపాటి అవమానించారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై నాగబాబు స్పందించారు. మెగాస్టార్ క్రేజ్‌ను చూసి ఎవరైనా ఈర్ష పడుతారు. అది కామన్. ఆయన పెద్దవారు. ఏదో ఆవేశంలో అలా అని ఉంటారు.

Ram Gopal Varma About on Garikipati Narasimha Rao
Ram Gopal Varma : చిరు జోలికొస్తే ఎవరినైనా వదలం
మెగాఫ్యాన్స్ కాస్త సంయమనంతో ఉండాలని నాగబాబు పిలుపునిచ్చారు. తాజాగా నాగబాబు ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ ఆర్జీవీ రెచ్చిపోయారు. మెగాస్టార్, ఆయన ఫ్యామిలీ జోలికొస్తే ఫ్యాన్స్ తరఫున ఊరుకునేది లేదు. ‘ఐయాం సారీ.. మెగాస్టార్‌ని అవమానించిన గుర్రంపాటిని క్షమించే ప్రసక్తి లేదు. మా అభిమానుల దృష్టిలో వాడు మాకు గ(డ్డిప)రకతో సమానం.. తగ్గేదెలే.. అంటూ ట్వీట్ చేశాడు. హే గరికపాటి బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కినక్కి దాక్కో, అంతేకాని పబ్లిసిటీ కోసం ఫిలిం ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో.. నీకు తెలివిఉందని అనుకుంటున్నావు కాబట్టి నువ్వే తెలుసుకో’..అంటూ ట్వీట్ చేశాడు.