Ram Gopal Varma : తెలుగు మీడియా రంగంలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఆర్జీవి పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. రాజకీయానికి సంబంధించి అయినా ఇంకా సమాజంలో జరిగే రకరకాల సంఘటనలపై ఆర్జీవి చేసే కామెంట్లు అనేక చర్చలకు దారితీస్తుంది. హైదరాబాద్ లో కుక్క కాటు ఘటనాలపై మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన ఆర్జీవి ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో మహిళా అధ్యాపకులు ఇంకా విద్యార్థులు ఉన్న సమయంలో రంభ, ఊర్వశి, మేనక లనీ… భూమి మీద ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలని ప్రసంగించడం జరిగింది.

దీంతో ఆర్జీవి చేసిన కామెంట్లపై టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆర్జీవి, నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ లపై సుమోటాగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ… జాతీయ మహిళా కమిషన్, UGC చైర్ పర్సన్ లకు లేఖ రాయడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో… కర్మ కాలి రాంగోపాల్ వర్మతో తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటుంది అని నేటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయిన పెట్టేయాలి… కడుపైన చేసేయాలి అని బాలకృష్ణ కామెంట్లతో పోలిస్తే ఆర్జీవి చేసిన వ్యాఖ్యలు

పెద్ద తప్పేం కాదని మరికొంతమంది కౌంటర్లు వేస్తున్నారు. ఈ విషయంపై ఆర్జీవి తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తే టీడీపీకే భారీ డ్యామేజ్ అని అంటున్నారు. ఇటీవల రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయాలకు సంబంధించి టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర పై లేదా అంతకుముందు పట్టాభిని ఉద్దేశించి రసగుల్లా అంటూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. అయితే ఈ నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవి ప్రసంగంపై టీడీపీ అతి చేస్తే… ఆ పార్టీకే పెద్ద నష్టమని తాజా వార్త పై సోషల్ మీడియాలో చాలామంది రియాక్ట్ అవుతున్నారు.