Ram Gopal Varma : ఓటీటీ వద్దంటే జొమాటో ను కూడా బ్యాన్ చేయాలంటున్న రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా పిచ్చిగా విభిన్నంగా అనిపిస్తుంది.. కానీ ఆయన మాటలు లోతుగా ఆలోచిస్తే అర్థమవుతాయి. తాజాగా టాలీవుడ్ సినిమా పరిశ్రమతో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అనేక రకాలుగా చర్చ జరుగుతుంది. అందరూ కూడా డిజిటల్ ప్లాట్ఫారం పరిధి ఎక్కువ అవ్వడం వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టాలు వస్తున్నాయి అంటూ విశ్లేషణలు చేస్తున్నారు. సినిమాలు డిజిటల్ ప్లాట్ఫారంపై కాస్త ఆలస్యంగా విడుదల అవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
ఓటీటీ ల్లో ఆలస్యంగా వచ్చిన సినిమాలకు కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు.. అయినా కూడా ఈ సమయంలో నిర్మాతలు ఎక్కువ శాతం ఓటీటీ ల మీద విరుచుకుపడుతున్నారు. వారి ఆరోపణలను వర్మ సున్నితంగా తిరస్కరించాడు.. కొట్టిపారేశాడు. ఆయన మాట్లాడుతూ ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన జొమాటో మరియు స్విగ్గి లను హోటల్ నిర్వాహకులు మరియు యాజమాన్యాలు బ్యాన్ చేయాలి అంటే ఎలా ఉంటుందో నిర్మాతలు ఓటీటీ లను బ్యాన్ చేయాలి అంటే అలాగే ఉంది అంటూ కామెంట్ చేశాడు.
ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా హోటల్స్ కి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అలాగే ఓటీటీ వల్ల కూడా నష్టం అయితే లేదు అనేది రాంగోపాల్ వర్మ వాదన. సినిమా అనేది చక్కగా తీస్తే దాన్ని థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు ముందుకు వస్తారు. ఆసక్తి తక్కువ ఉన్న వాళ్ళు డిజిటల్ ప్లాట్ ఫారంపై లేదా టీవీలో చూస్తారు. అంతే తప్ప ఓటీటీ ల వల్ల సినిమాలు ఆడడం లేదు అంటే మాత్రం తాను ఒప్పుకోను అన్నట్లుగా రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై ఇతర టాలీవుడ్ నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.