Ram Gopal Varma : నీది చీకాలని ఉంది.. రాజమౌళిని వేడుకున్న రామ్ గోపాల్ వర్మ..!!

Advertisement

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన నేరుగా మాట్లాడినా.. ట్వీట్ చేసినా ఏదైనా సరే.. హడలెత్తాల్సిందే. తాజాగా ఆయన ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మీద చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఆయన చేసిన వ్యాఖ్యల గురించే చర్చ. నిజానికి రామ్ గోపాల్ వర్మకు వొడ్కా అంటే ఇష్టం. వొడ్కా తాగుతూ ఎవరి మీద పడితే వారి మీద ఇష్టం ఉన్నట్టుగా కామెంట్లు చేయడం ఇష్టం.

Advertisement

చాలాసార్లు ఆయన తప్ప తాగి ట్వీట్లు చేస్తుంటారు. మరి ఇది కూడా అలాగే చేశారా అనేది పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళిని మాత్రం ఓ రేంజ్ లో పొగిడేశాడు. మీరు ఎందరో స్టార్ డైరెక్టర్లను దాటేశారని చెప్పుకొచ్చాడు. ఒక మొఘలే అజామ్ సినిమా తీసిన కా ఆసిఫ్ దగ్గర్నుంచి.. షోలే సినిమా తీసిన రమేశ్ సిప్పి వరకు అందరినీ దాటేశారని.. మిమ్మల్ని మించిన దర్శకధీరుడు భారతదేశంలో ఎవ్వరూ లేరు అన్నట్టుగా ట్వీట్ చేశారు వర్మ. అందుకే మీ కాలి వేలును నాకాలని ఉంది అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement
Ram Gopal Varma praises rrr director rajamouli
Ram Gopal Varma praises rrr director rajamouli

Ram Gopal Varma : మిమ్మల్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు.. సెక్యూరిటీ పెంచుకోండి

అంతే కాదు.. మిమ్మల్ని చంపడానికి చాలామంది డైరెక్టర్లు అందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు. దయచేసి మీరు సెక్యూరిటీ పెంచుకోండి.. ఆ డైరెక్టర్లలో నేను కూడా ఉన్నాను. కాబట్టి.. మీరు నా మాట విని సెక్యూరిటీని పెంచుకోండి. ఈ సీక్రెట్ ను మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే.. నేను ఇప్పటికే నాలుగు పెగ్గులు వేశా. మాంచి కిక్కులో ఉన్నా. అందుకే నోరు జారా అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ. మరి.. వర్మ ట్వీట్స్ పై రాజమౌళి స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement