Janaki Kalaganaledu : జ్ఞానాంబ ఇచ్చిన డబ్బులతో జానకి ఐపీఎస్ ఫీజు రామా కడతాడా? ఈ విషయం తెలిసి జ్ఞానాంబ ఏం చేస్తుంది?
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 25 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 286 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి ముగ్గు వేయడం కోసం బయటికి వస్తుంది. అప్పటికే మల్లిక ముగ్గు వేసేందుకు బయటికి రావడంతో నేను ముగ్గు వేస్తానులే అంటుంది జానకి. దీంతో నేను వేస్తా అంటుంది. ఏం కాదు.. నువ్వు వెళ్లి అందరికీ టీ పెట్టు. నేను ముగ్గు వేస్తాను అంటుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి ఆ ముగ్గు గిన్నెను తీసుకొని నేను వేస్తా అంటుంది జ్ఞానాంబ. జానకికి ఇప్పటి నుంచి ఏ పని చెప్పకూడదు అంటుంది జ్ఞానాంబ. తను ఒక్క పని కూడా చేయడానికి వీలు లేదు అంటుంది జ్ఞానాంబ.
మల్లిక లోపలికి వెళ్లాక.. జానకికి షాకింగ్ విషయాలు చెబుతుంది జ్ఞానాంబ. నువ్వు ఈ ఇంట్లో ఒక వస్తువువు మాత్రమే. నువ్వు ఏ పని చేయడానికి వీలు లేదు. నీకు ఎవ్వరూ ఒక్క పని కూడా చెప్పరు అని చెబుతుంది జ్ఞానాంబ. ఇంతలో రామా వచ్చి నేను కొట్టుకు వెళ్తున్నా అని చెబుతాడు. కొన్ని రోజుల పాటు మనతో ఏం పని చేయించకూడదని అమ్మ నిర్ణయం తీసుకుందని చెబుతాడు రామా. ఆ తర్వాత కొట్టుకు బయలుదేరుతాడు.
మరోవైపు తన కొడుకు బారసాల కోసం జ్ఞానాంబ ఫ్యామిలీని పిలవను అని యోగి తన భార్యతో చెబుతాడు. దీంతో వద్దు.. మనం జానకి వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లందరినీ కుటుంబ సమేతంగా బారసాలకు పిలవాలి.. అని చెప్పి తనను ఒప్పిస్తుంది ఊర్మిల.
కట్ చేస్తే.. అభి.. జానకికి ఫోన్ చేసి నైట్ క్లాస్ లకు వెళ్లడం లేదేంటి. ఏమైంది అని అడుగుతాడు. ఆ తర్వాత ఫీజు కట్టాలని లక్ష రూపాయలు కట్టాలని చెబుతాడు. దీంతో షాక్ అవుతుంది జానకి. ఇంతలో రామా వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. దీంతో వారం రోజుల్లో అకాడెమీకి ఫీజు కట్టాలి అని చెబుతుంది. ఎంత అని అడుగుతాడు రామా.
దీంతో లక్ష రూపాయలు అంటుంది. ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతారేంటండి బాబు అంటాడు. ఒక రెండు మూడు రోజుల్లో కట్టేద్దాం అంటాడు. దీంతో వద్దు రామా గారు అంటుంది. అసలు కట్టాల్సిన అవసరం లేదు. నేను ఐపీఎస్ కు ప్రిపేర్ అవ్వడం మానేస్తున్నాను అంటుంది జానకి.
దీంతో రామా షాక్ అవుతాడు. మళ్లీ ఏమైంది అంటాడు రామా. ఆ దేవుడి దయ వల్ల అత్తయ్య గారు మనల్ని ఇంట్లోకి రానిచ్చారు. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో అత్తయ్య గారికి తెలియకుండా మీరు నన్ను చదివిస్తున్న విషయం అత్తయ్య గారికి తెలిస్తే పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తాయి అంటుంది జానకి.
Janaki Kalaganaledu : జానకి ఫీజు ఎలా కట్టాలో అర్థం కాని రామా
రామా గారు.. మీ తల్లి కొడుకులు సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం. నా కారణంగా మీకు బాధపడే పరిస్థితి రాకూడదు అంటుంది. కానీ.. నా భార్య కలను తనకు అందించడం నాకు ముఖ్యం. దాని కోసం నేను ఎంత బాధనైనా భరిస్తాను అంటాడు.
మీ చదువు గురించి అమ్మకు తెలిస్తే గొడవలు అవుతాయని మీరు భయపడుతున్నారు కానీ.. అమ్మ అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకు పూర్తిగా వచ్చేసింది అంటాడు రామా. ఆ తర్వాత విశ్వనాథం ఇంట్లో పెళ్లికి ఇచ్చిన ఆర్డర్ కు 3 లక్షలు డబ్బులు ఇచ్చారని జ్ఞానాంబకు చెబుతాడు రామా.
ఆ డబ్బుల్లో ఒక లక్ష తీసుకొని జానకి ఫీజు కట్టాలని అనుకుంటాడు. కానీ.. ఇంతలో టౌన్ లో మరో కొట్టు పెడుదామని.. దాని కోసం ఒక మంచి కొట్టు చూసి.. ఈ డబ్బును అడ్వాన్స్ గా ఇవ్వమని చెబుతుంది జ్ఞానాంబ. అప్పటి వరకు ఈ డబ్బును నీ దగ్గరే పెట్టుకో. ఆ డబ్బును వేరే ఏ అవసరాలకు ఉపయోగించకు అని చెబుతుంది జ్ఞానాంబ.
దీంతో జానకి ఫీజు ఎలా కట్టాలో అర్థం కాదు రామాకు. మరోవైపు జానకి, రామా ఇద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు. మీరు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. మీరు చెప్పిన మాట అక్షరాలా నిజం. మన బంధం ఏ జన్మలోనో రాసిపెట్టిన అనుబంధం అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.