Rama Prabha : ఆ డైరెక్టరే ప్రతి నెలా నా అకౌంట్ లో డబ్బులు వేసి ఆదుకుంటున్నాడు.. రమా ప్రభ
Rama Prabha : రమాప్రభ,Rama Prabha, గురించి తెలుసు కదా. తెలుగులో తొలి కమెడియన్ ఆమె. తెలుగుతో పాటు తమిళంలో దాదాపు 1400 సినిమాల్లో నటించింది. అన్ని సినిమాల్లో నటించి డబ్బులు బాగానే పోగేసుకుంది. ఆస్తులు కూడగట్టుకుంది కానీ.. తను చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుంది రమాప్రభ. ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డసమయంలో తనను ఓ డైరెక్టర్ ఆదుకున్నాడంటూ చెప్పుకొచ్చింది రమాప్రభ.
తను 1966 లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2015 వరకు సినిమాల్లో నటించి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. అప్పట్లో పాత తరం హీరోల సరసన నటించింది. ఇప్పటి తరం కొత్త హీరోల సరసన కూడా రమాప్రభ నటించి అందరినీ మెప్పించింది. కేవలం ఒక వ్యక్తిని నమ్మి తన ఆస్తి మొత్తం పోగొట్టుకుంది రమాప్రభ. అతడు నమ్మించి తన ఆస్తి మొత్తాన్ని అతడి పేరు మీదికి రాసుకున్నాడట. దీంతో తనకు రూపాయి కూడా లేని స్థితి ఉండటంతో ఓ స్టార్ డైరెక్టర్ తనను ఆదుకున్నాడట.
Rama Prabha : ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?
తనను ఏమీ లేని పరిస్థితుల్లో ఆదుకున్నది ఎవరో కాదు.. పూరీ జగన్నాథ్. బద్రి సినిమా నుంచే రమాప్రభతో పూరీకి అనుబంధం ఉంది. తన పరిస్థితిని అర్థం చేసుకున్న పూరీ జగన్నాథ్.. ప్రతి నెల 5 వ తారీఖున రమాప్రభకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారట. అసలు.. తన అకౌంట్ లో డబ్బులు వేస్తున్నట్టు రమాప్రభకు ఏనాడూ చెప్పలేదట పూరీ. అసలు తన అకౌంట్ లో ఎవరు డబ్బులు వేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నంగా చేయగా.. అప్పుడు పూరీ జగన్నాథ్ అని తెలిసిందట. వెంటనే ఆయనకు ధన్యవాదాలు తెలిపిందట.