Ramya Krishnan : రమ్యకృష్ణ లుక్ లీక్.. ‘లైగర్’లో అలాంటి పాత్రే!
Ramya Krishnan : పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం పేరు లైగర్. సింహానికి పులికి క్రాస్ బ్రీడింగ్ చేస్తే వచ్చేదాన్ని లైగర్ అంటారన్న సంగతి తెలిసిందే. అందుకే లైగర్ సినిమాకు సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేశాడు. అయితే ఇందులో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులుగా రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్‌లు నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో ఆ ఇద్దరూ కనిపించలేదు.
అయితే ఈ మధ్యే మొదలుపెట్టిన షెడ్యూల్‌లో రమ్యకృష్ణ జాయిన్ అయినట్టు కనిపిస్తోంది. అయితే తాజాగా రమ్యకృష్ణ లుక్ లీకైంది. ప్రస్తుతం ముంబై పరిసర ప్రాంతాల్లో లైగర్ షూటింగ్ జరగుతోంది. ఈ మూవీపై ఉన్న అంచనాలకు తగ్గట్టే సినిమాను అత్యంత భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ప్యాన్ ఇండియన్ లెవెల్‌కు తగ్గట్టే సినిమాను భారీ రేంజ్‌లో విడుదలకు ప్లాన్ చేశారు. ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అనన్య పాండేను తీసుకున్నారు.

Ramya Krishnan look leaked from liger Movie
Ramya Krishnan : రమ్యకృష్ణ పిక్ లీక్..
ఇక దక్షిణాది ప్రేక్షకుల అభిరుచి మేరకు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ వంటి అద్భుత నటీమణులను తీసుకున్నాడు. అయితే ఇందులో రమ్యకృష్ణ మధ్య తరగతి తల్లి పాత్రను పోషించబోతోన్నట్టు ఆమె మేకప్‌ను చూస్తే తెలుస్తోంది. ముంబైలోని స్లమ్ ఏరియాలో రమ్యకృష్ణ ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా పూరి మళ్లీ తన ట్రాక్‌ను వదలకుండా పాత ఫార్మాట్‌నే వాడుతున్నట్టు కనిపిస్తోంది. అసలే ఇస్మార్ట్ సక్సెస్ జోరు మీదున్న పూరికి లైగర్ హిట్ అవ్వడం ఎంతో ముఖ్యం.