Rana : రానా ఫ‌స్ట్ లవ్ సాయి ప‌ల్ల‌వి.. ఇది విన్నారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rana : రానా ఫ‌స్ట్ లవ్ సాయి ప‌ల్ల‌వి.. ఇది విన్నారా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :4 March 2022,12:30 pm

Rana : ద‌గ్గుబాటి రానా.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.బాహుబ‌లి సినిమాలో భ‌ళ్లాల‌దేవుడిగా క‌నిపించి అల‌రించిన రానా రీసెంట్‌గా భీమ్లా నాయ‌క్ సినిమాలో డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో మెరిసాడు. ఆ పాత్ర‌లో రానా త‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టాడు. డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌కు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి రానా కూడా చాలా సంతోషించాడు.మీడియాతో తాజాగా ముచ్చ‌టించిన రానా కొంద‌రు నాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు లేడి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టిస్తున్నావ‌ని అన్నారు. సాయి ప‌ల్ల‌వి సౌత్ ఇండియన్ సినిమాకి ఒక బహుమతి అని రానా అన్నారు. విరాట పర్వం తన మొదటి సరైన ప్రేమకథ అని చెప్పాడు. “ఈ చిత్రం 1970లు మరియు 80ల నాటి నేపథ్యంలో సాగుతుంది.

ఈ సినిమాలో సాయి పల్లవిపై ప్రేమ క‌న‌బరిచే వ్య‌క్తిగా నటిస్తున్నాను అని అన్నాడు. నా కెరీర్‌లో ఇదే తొలి సరైన ప్రేమకథ” అని అన్నారు.సాయి పల్లవి నటనా పటిమను చూసి రానా ఎంతగానో విస్మయానికి లోనయ్యాడని చెబుతున్నారు. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారు. ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్‌ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తాను. సోషల్‌ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది. ‘ఇతర ఇండస్ట్రీల్లో కథల్ని చెబుతారు. తెలుగు ఇండస్ర్టీ మాత్రం ఫిల్మ్‌ మేకింగ్‌ చెబుతుందని ‘వకీల్‌సాబ్‌’ రిలీజ్‌ టైమ్‌ ఓ డిస్ట్రిబ్యూటర్‌ చెప్పారు.

rana emotional comments on sai pallavi

rana emotional comments on sai pallavi

Rana : రానా ఎమోష‌న‌ల్ కామెంట్స్..

అప్పుడే నాకు ఈ విషయాలన్నింటి మీద ఓ అవగాహన వచ్చింది అని రానా అన్నారు.భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారనే విషయం తెలిసి.. ఈ ప్రాజెక్ట్‌ చాలా పెద్దది అయిపోయిందే అనుకొన్నాను. పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ వచ్చి ఇలాంటి జోనర్ సినిమాను. ఆ పాత్రను చేస్తున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇక త్రివిక్రమ్ ఒక ఎక్సైటింగ్ పర్సన్. అతడు ఏమి మాట్లాడినా విలువైనది అనిపిస్తుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకొనే అవకాశం కలిగింది. పవన్, త్రివిక్రమ్ నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నాను. భీమ్లా నాయక్ నాకు మంచి అనుభూతిని కలిగించింది అని రానా దగ్గుబాటి అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది