Rashmi : లాగి చెంపదెబ్బ కొట్టిన యాంకర్ రష్మీ.. దెబ్బకి ఢీ కంటెస్టెంట్ షాక్
Rashmi : ఢీ కంటెస్టెంట్, డ్యాన్సర్ పండు గురించి అందరికీ తెలిసిందే. నాది నక్కలిసు గొలుసు అంటూ ఆడవేశం వేసుకుని చేసిన స్టెప్పులు రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేశాయి. పండు డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా ఆ పాట వ్యాల్యూ కూడా పెరిగింది. దుర్గారావు అనే టిక్ టాక్ స్టార్ వేసిన స్టెప్పులను పండు దుమ్ముదులిపేశాడు. అలా మొత్తానికి పండు, దుర్గా రావు, నాది నక్కిలిసు గొలుసు పాట ఇలా అందరూ ఫేమస్ అయ్యారు.
అప్పటి నుంచి పండు పేరు మార్మోగిపోతూనే ఉంది. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, నటుడు, కమెడియన్‌గా పండు దూసుకుపోతోన్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, వెబ్ సిరీస్‌లు ఇలా ఎన్నో షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి వచ్చాడు. అందులో రష్మీ చేత తన్నులు తిన్నాడు. లాగి పెట్టి పటా పటా వాయించేసింది రష్మీ.

Rashmi Gautam Beats Comedian Pandu On Jabardasth
Rashmi : పండుపై రష్మీ ప్రతాపం..
అలా పండును చెంప దెబ్బలు కొట్టడం వెనక కారణం కూడా ఉంది. రష్మీతో కలిసి పండు ఎంట్రీ డ్యాన్స్ వేశాడు. పండుకు విలువ ఎప్పుడు ఉంటుందంటే.. చిలక కొట్టినప్పుడే ఉంటుంది.. అందుకే ఇలా చిలక (రష్మీ)తో వచ్చాను అని పండు అంటాడు. ఆ మాటతో రష్మీ పండు చెంపలను వాయించేస్తుటుంది. నువ్వే అన్నావ్ కదా? చిలక కొట్టుడు అని అందుకే కొడుతున్నాను అంటూ రష్మీ రెచ్చిపోయింది.
