Rashmi Gautam : ఆ బాధ నాకు తెలుసు!. ఏడిపించేసిన రష్మీ గౌతమ్

 Authored By prabhas | The Telugu News | Updated on :28 May 2022,9:30 pm

Rashmi Gautam : యాంకర్ రష్మీ ప్రేమ, పెళ్లి వ్యవహారాలు నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఇది వరకే రష్మీకి పెళ్లి అయిందని, విడాకులు కూడా అయిపోయాయని, అందుకే ఒంటరిగా ఉందని ఇలా కథనాలు వస్తుంటాయి. అయితే రష్మీ మాత్రం ఎప్పుడూ వీటి మీద రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆన్ స్క్రీన్ మీద రష్మీ లవ్ స్టోరీ మాత్రం ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. బుల్లితెరపై రష్మీ సుధీర్ జోడి ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే.

గత కొన్నేళ్లుగా రష్మీ సుధీర్ జంట ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. జబర్దస్త్ షోకు ఈ ఇద్దరూ మైలేజ్‌గా మారిపోయారు. ఇక పండుగలు వస్తే ఈ ఇద్దరి మీదే ఈవెంట్లు ప్లాన్ చేసేవారు. అలా రష్మీ సుధీర్ ప్రేమకథకు బాగానే కలరింగ్ ఇచ్చారు. కానీ తామిద్దరం మాత్రం మంచి స్నేహితులమేనని చెబుతూ ఉంటారు.తాజాగా రష్మీ మీద ఓ స్పెసల్ స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. తాజాగా వదిలిన ప్రోమోలో రాం ప్రసాద్ స్కిట్లో రష్మీ నటించినట్టు కనిపిస్తోంది. రష్మీని పెళ్లి కూతురిగా చూపించారు.

Rashmi Gautam Gets Emotional On Love And marriage In Extra Jabardasth Promo

Rashmi Gautam Gets Emotional On Love And marriage In Extra Jabardasth Promo

అయితే పెళ్లి కొడుకుని మాత్రం చూపించకుండా సస్పెన్స్ పెంచేశారు. అది సుధీర్ అయి ఉంటాడా? అని చాలా మంది అనుకుంటున్నారు. అది ఎవరన్నది వచ్చే వారం తెలుస్తోంది. అయితే రష్మీ మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు అందరినీ టచ్ చేశాయి.మనస్పూర్తిగా మనం ఒకరికి మనసును ఇస్తే.. గుండె చప్పుడు ఆగేవరకు.. అక్కడ వారికే స్థానం ఉంటుంది.. మనకు ఇష్టమున్న వాళ్లు మన పక్కన లేకపోతే ఉండే బాధేంటో నాకు తెలుసు.. అంటూ యాంకర్ రష్మీ అందరినీ ఏడిపించేసింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి