Rashmi Gautam : శ్రీదేవి డ్రామా కంపెనీలో అడుగు పెట్టబోతున్న రష్మి గౌతమ్…. కారణం ఇదే!
Rashmi Gautam : ఈ టీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ వారం వారం సరి కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జబర్దస్త్ తో పోలిస్తే రేటింగ్ విషయం లో కాస్త వెనుకబడి ఉన్నా ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ తారాగణంతో శ్రీదేవి డ్రామా కంపెనీ వారం వారం సరి కొత్త వారితో వెలిగి పోతూ ఉంది. తాజాగా సీనియర్ యాంకర్లు, పాత సినిమాల నటీనటులు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై సందడి చేశారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ మొదలు పెట్టిన సమయంలో సరిగా సుధీర్ ఉండేవాడు కాదు.. కొన్ని వారాల తర్వాత సుధీర్ ని రంగంలోకి దించారు…
సుధీర్ వచ్చిన తర్వాత సహజంగానే ఈ కార్యక్రమం యొక్క రేటింగ్ అమాంతం పెరిగింది. అందుకే 5 వారాలు అనుకున్న కార్యక్రమానికి సుధీర్ తో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సుధీర్ ఈ కార్యక్రమాన్ని తన దైన శైలిలో కొనసాగిస్తూ అద్భుతమైన కార్యక్రమం గా ముందుకు తీసుకెళ్తున్నాడు… శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎప్పటికప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు చేసే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా సుధీర్ తో పాటు రష్మి కూడా ఉంటే బాగుంటుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రష్మీ తో చర్చలు జరుపుతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Rashmi Gautam in to Sridevi Drama Company with sudigali sudheer
జబర్దస్త్ కు యాంకర్గా వ్యవహరిస్తున్న రష్మి ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కి యాంకర్గా వ్యవహరించిన ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా సుధీర్ తో యాంకర్ గా చేసేందుకు ఆమె కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా వీరు మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది… ఇద్దరి మధ్య ప్రేమ లేదని తెలిసినా కూడా ప్రేక్షకులు మాత్రం వారిద్దరి మధ్య ఏదో ఉంది అని ఊహించుకుంటూ కార్యక్రమాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి ఎంట్రీ తో శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.