Rashmi Gautam : పెళ్లి పీటలెక్కిన రష్మి గౌతమ్.. పెళ్లి కొడుకు మొహం మాత్రం కనబడకుండా… సుధీర్ తోనేనా పెళ్లి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautam : పెళ్లి పీటలెక్కిన రష్మి గౌతమ్.. పెళ్లి కొడుకు మొహం మాత్రం కనబడకుండా… సుధీర్ తోనేనా పెళ్లి

 Authored By mallesh | The Telugu News | Updated on :23 May 2022,5:30 pm

Rashmi Gautam : బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ బుల్లి తెరను ఏలేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో కెమెరా ముందు చాలా అందంగా కనిపించేందుకు చాలా ట్రై చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోత సరేసరి. ఈ పనులతో యాంకర్ రష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టుకుంది. దీంతోనే ఆమెకు పెద్ద ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక జబర్దస్త్ లో సుధీర్, రష్మిల లవ్ ట్రాక్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.

వీరి లవ్ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం రష్మి సుధీర్ తో పిచ్చపాటి ప్రేమలో ఉందంటూ చాలా మంది జనాలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ జంట మాత్రం ఈ విషయాన్ని ఎప్పుడూ కన్ఫామ్ చేయలేదు. ఈ విషయం గురించి సస్పెన్స్ మాత్రం అలాగే కొనసాగుతోంది. కానీ చూసే వారు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూసేందుకు చాలా బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. వీరి జంట చూసేందుకు చాలా అందంగా ఉంటుందని అంటున్నారు.హాట్, హాట్ అందాలు ఆరబోసే రష్మి గౌతమ్ తాజాగా పెళ్లి పీటలెక్కింది.

Rashmi Gautam is getting married

Rashmi Gautam is getting married

Rashmi Gautam : పెళ్లి పీటలెక్కిన రష్మి.. వరుడు సుధీరా లేక?

వరుడు సుధీరా కాదా అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయకుండా టెన్షన్ పెట్టేసింది. వరుడి మొహాన్ని మొత్తం మల్లెపూలతో కవర్ చేశారు. కేవలం రష్మి మాత్రమే కనిపించేలా డిజైన్ చేశారు. రష్మి యాంకర్ గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని జబర్దస్త్ స్కిట్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా చేశారా? లేక నిజంగానే రష్మి పెళ్లి చేసుకుందా? అనే అనుమానాలను పలువురు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీ తాజాగా విడుదల చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్ లో ఇది కనిపించింది. ఈ ఎపిసోడ్ మే 27 వ తేదీన టెలికాస్ట్ కాబోతుంది.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది