Rashmi Gautam : రష్మీ మళ్లీ ఏకచత్రాధిపత్యం… జబర్దస్త్ లో రాబోతున్న మరిన్ని మార్పులు
Rashmi Gautam : జబర్దస్త్ కామెడీ షో లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. కాని రోజుకు ఒక వార్త మాత్రం బయటకు వస్తుంది. మల్లెమాల వారు ఖర్చు తగ్గించుకునే ప్రొగ్రాం లో భాగంగా చాలా మంది కమెడియన్స్ ను తగ్గించడం తో పాటు చాలా వరకు కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో జబర్దస్త్ కార్యక్రమం రేటింగ్ మరీ దారుణంగా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈటీవీ జబర్దస్త్ కు మొదట అనసూయ యాంకర్ గా ఉండేది. ఆమె మద్యలో వెళ్లి పోవడంతో రష్మీ ఎంట్రీ ఇచ్చింది.
దాదాపుగా 9 ఏళ్ల నుండి రష్మీ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతుంది. మద్యలో అనసూయ మళ్లీ ఎంట్రీ ఇచ్చినా కూడా రష్మీ మాత్రం ఔట్ అవ్వలేదు. జబర్దస్త్ అనసూయ మరియు ఎక్ట్స్ ట్రా జబర్దస్త్ ను రష్మీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అనసూయ వెళ్లి పోతుంది అనే వార్తలు గుప్పుమంటున్నారు. చాలా రోజులుగా అనసూయ స్టార్ మా లో సందడి చేస్తుంది. అక్కడ ఇక్కడ చేయడం అనేది సాధ్యం కాదు. గతంలో జబర్దస్త్ నుండి వెళ్లిన అనసూయ మళ్లీ వెళ్లడంలో ఆశ్చర్యం లేదు. అనసూయ వెళ్తే జబర్దస్త్ పరిస్థితి ఏంటీ అంటూ చర్చించుకుంటున్న సమయంలో అందరికి రష్మీ కనిపిస్తుంది.

Rashmi Gautam is the anchor of jabardasth comedy two episodes show
సుధీర్ వెళ్లి పోయిన సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీకి రష్మీని యాంకర్ గా చేశారు. ఇప్పుడు అనసూయ వెళ్లి పోతే జబర్దస్త్ మొత్తంను ఏకచత్రాధిపత్యం అన్నట్లుగా రష్మీ ఏళబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. మరో వైపు అనసూయ ప్లేస్ లో రాబోయే రోజుల్లో సీనియర్ యాంకర్ మంజూషా కి ఛాన్స్ దక్కే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మంజూషా వచ్చినా రాకున్నా జబర్దస్త్ లో రష్మీ రేంజ్ మరింతగా పెరగడం ఖాయం.. ఆమె జబర్దస్త్ ఉన్నంత కాలం ఉంటుందని అభిమానులు అంటున్నారు.