Rashmi Gautam : వారెవ్వా రష్మీ.. ధగధగ మెరిసిపోతున్నావుగా..!
Rashmi Gautam : రష్మీ గౌతమ్.. ఇప్పుడు బుల్లితెర క్వీన్‌గా మారింది. ఒకప్పుడు ఒకటి రెండు షోలకే పరిమితం అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస పెట్టి షోలు చేస్తుంది. జబర్ధస్త్ షో కూడా ఈ అమ్మడి ఖాతాలో చేరింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోని కూడా రష్మీనే హోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి హంగామా మాములుగా లేదు. క్యూట్, స్మైలీ, ఎనర్జిటిక్. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అందరిలో జోష్ నింపుతుంటుంది. అదేవిధంగా అందాలను, తన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ , పిచ్చెక్కిస్తోంది. ఎప్పుడు వైవిధ్యమైన లుక్స్‌తో కట్టిపడేస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది.
Rashmi Gautam : రష్మీ రచ్చ..
మతిపోయే పొటోషూట్లతో ఈ బ్యూటీ నెటిజన్లకు కనువిందు చేస్తోంది. మత్తెక్కించే అందంతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. లేటెస్ట్ ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ మతిపోగొడుతోంది. తాజాగా రష్మీ గౌతమ్ మెస్మరైజింగ్ లుక్స్‌తో ధగధగ మెరుస్తుంది. ఈ క్యూట్ బ్యూటీ అందాల ఆరబోతకు కుర్రకారు మతులు పోతున్నాయి. ప్రస్తుతం రష్మీ గౌతమ్ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వాటికి నెటిజన్స్ స్టన్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.
రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు. ఇద్దరూ రొమాంటిక్ డ్యూయెట్లు చేస్తూ అలరిస్తున్నారు. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. జబర్దస్త్ నుంచి సుధీర్ తప్పుకోవడంతో రష్మీ ఒంటరైపోయింది అంటూ ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైన రష్మీ గౌతమ్ క్యూట్ అందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్‌గానే మారుతుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.