Rashmi Gautham : మ‌నుషులు దూరంగా ఉన్నా, మ‌న‌సుకు సంబంధం ఉండదు అంటూ.. సుధీర్ గురించి ఓపెన్ అయిన రష్మి గౌతమ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmi Gautham : మ‌నుషులు దూరంగా ఉన్నా, మ‌న‌సుకు సంబంధం ఉండదు అంటూ.. సుధీర్ గురించి ఓపెన్ అయిన రష్మి గౌతమ్

 Authored By sandeep | The Telugu News | Updated on :14 July 2022,8:33 pm

Rashmi Gautham : బుల్లితెర క్రేజీ జోడి సుధీర్, ర‌ష్మీ ఎంత పాపులారిటీ సంపాదించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జబర్దస్త్ లో చాలా మంది అభిమానులు ఇష్టపడే కాంబినేషన్ సుడిగాలి సుధీర్ రష్మీ. వీరి కెమిస్ట్రీ తో ఆ షోను ఎక్కడికో తీసుకెళ్లారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.జబర్ధస్త్‌లో కలిసి వీళ్లిద్దరూ దాదాపు తొమ్మిదేళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎవ‌రు ఎంత‌లా మాట్లాడుతున్నా కూడా ఈ జంట మాత్రం త‌మ మేట‌ర్ గురించి ఓపెన్ కావ‌డం లేదు. సుధీర్, రష్మీ జంట.  పలు స్పెషల్ ఈవెంట్స్‌లో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి మంచి కిక్కిచ్చారు .

రష్మీ గౌతమ్ నటిగా కెరీర్‌ను ప్రారంభించి.. ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఇక, మ్యాజిక్‌లు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా మారిపోయాడు సుధీర్. జబర్ధస్త్ షో ద్వారా వీళ్లిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి జంటగా మారారు. ఎప్ప‌టి నుండో వీరిద్ద‌రి గురించి అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఎన్నోసార్లు అటు `జబర్దస్త్` వేదికగా, ఇటు `శ్రీదేవి డ్రామా కంపెనీ` వేదికగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంత కాలంగా సుధీర్, ర‌ష్మీ జంట‌గా ఎలాంటి షోస్‌లో క‌నిపించ‌డం లేదు. ఇంక సుధీర్ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇప్పుడు ర‌ష్మీ వ‌చ్చి తెగ సంద‌డి చేస్తుంది.

Rashmi Gautam opens up about Sudigali Sudheer

Rashmi Gautam opens up about Sudigali Sudheer

Rashmi Gautham : ఓపెన్ అయిందిగా..!

సుధీర్ వేరే ఛానల్‌కి వెళ్ల‌డంతో ఆయన‌ స్థానంలో వ‌చ్చిన ర‌ష్మీపై హైప‌ర్ ఆది ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు వేస్తున్నారు. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన `శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో హైప‌ర్ ఆది.. సుధీర్ గురించి ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు వేశాడు. నువ్వేమన్నా మిస్‌ అవుతున్నావా? అని రష్మిని అడిగాడు. రష్మిని తాను దూరం నుంచి చూశానని, కాస్త ఎమోషనల్‌ అవుతున్నట్టు అనిపించిందని, అందుకే అడుగుతున్నట్టు చెప్పారు దానికి స్పందించిన ర‌ష్మీ.. మనసులకు దూరానికి సంబంధం ఉండదని, అవి ఎక్కడ ఉన్నా కలిసే ఉంటాయని తెలిపింది. మొత్తంగా సుధీర్‌తో రిలేషన్‌పై ఈ రకంగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది