Rashmi Gautam : చ‌నిపోయిన పెట్ డాగ్‌ని గుర్తు చేసుకుంటూ ర‌ష్మీ ఎమోష‌న‌ల్‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rashmi Gautam : చ‌నిపోయిన పెట్ డాగ్‌ని గుర్తు చేసుకుంటూ ర‌ష్మీ ఎమోష‌న‌ల్‌..!

Rashmi Gautam : యాంకర్ రష్మి గురించి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దశాబ్ద కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే స్లోగా స్టార్‌గా మారిన ఈ భామ యూత్‌లో మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామకు మొదట సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్​పై యాంకర్​గా అవతారం ఎత్తి ఆ త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ షో టాప్ యాంక‌ర్‌గా […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 April 2024,4:07 pm

ప్రధానాంశాలు:

  •  Rashmi Gautam : చ‌నిపోయిన పెట్ డాగ్‌ని గుర్తు చేసుకుంటూ ర‌ష్మీ ఎమోష‌న‌ల్‌..!

Rashmi Gautam : యాంకర్ రష్మి గురించి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దశాబ్ద కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే స్లోగా స్టార్‌గా మారిన ఈ భామ యూత్‌లో మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామకు మొదట సినిమాల్లో సరైన అవకాశాలు రాలేదు. దీంతో స్మాల్ స్క్రీన్​పై యాంకర్​గా అవతారం ఎత్తి ఆ త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ షో టాప్ యాంక‌ర్‌గా మారింది. రష్మి – సుడిగాలి సుధీర్‌ల ఆన్​స్క్రీన్​కెమిస్ట్రీ ఆడియెన్స్​ను బాగా దగ్గర చేసింది. వీరిద్ద‌రి మ‌ధ్య ఏం ఉందో తెలియ‌దు కాని ఇద్ద‌రు ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నారని, స‌మ్ థింగ్ స‌మ్‌థింగ్ ఉంద‌ని చెప్పేవారు చాలా మంది.

Rashmi Gautam : పెట్ డాగ్ గుర్తు చేసుకున్న ర‌ష్మీ

ర‌ష్మీ గౌత‌మ్‌లో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంటూ వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. . లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. అయితే మార్చి 9న రష్మీ ఇంట్లో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. రష్మీ ప్రేమగా పెంచుకుంటున్న తన పెట్ మరణించడంతో చాలా ఎమోష‌న‌ల్ అయింది. తన పెంపుడు కుక్కకి రష్మీ చుట్కి గౌతమ్ అని పేరు పెట్ట‌గా, అది త‌న బేబి గ‌ర్ల్ అని అతి మృతి చెంద‌డం త‌నకి తీర‌ని శోకాన్ని మిగిల్చింద‌ని చెప్పింది.

Rashmi Gautam చ‌నిపోయిన పెట్ డాగ్‌ని గుర్తు చేసుకుంటూ ర‌ష్మీ ఎమోష‌న‌ల్‌

Rashmi Gautam : చ‌నిపోయిన పెట్ డాగ్‌ని గుర్తు చేసుకుంటూ ర‌ష్మీ ఎమోష‌న‌ల్‌..!

అయితే నేటితో చుట్కీ మ‌ర‌ణించి నెల కావ‌డంతో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది. నువ్వు ఈ భూమి మీద లేక‌పోయిన నా హృద‌యంలో ఎప్ప‌టికీ నిలిచి ఉంటావు.నువ్వు తిరిగి వ‌స్తావ‌ని నేను న‌మ్ముతున్న‌ను. నువ్వు వ‌చ్చే వ‌ర‌కు నీ జ్ఙాప‌కాల‌లో బ్ర‌తుకుతుంటాను అని రాసుకొచ్చింది ర‌ష్మీ. ఆ మ‌ధ్య చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు తనతో గడిపిన పిక్స్​ను కూడా నెట్టింట్లో షేర్ చేసుకుంది. ఇక ర‌ష్మీ ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా పాల్గొంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది