Rashmi Gautam : రష్మికి భయంకరమైన వ్యాధి.. స్టెరాయిడ్స్ కూడా వాడుతుందా..!
ప్రధానాంశాలు:
Rashmi Gautam : రష్మికి భయంకరమైన వ్యాధి.. స్టెరాయిడ్స్ కూడా వాడుతుందా..!
Rashmi Gautam : బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీలో అత్యంత పాపులర్ షో అయిన జబర్దస్త్ కి యాంకర్‌గా వ్యవహించిన రష్మీ గౌతమ్ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. టీవీ షోస్‌లో మాత్రం రష్మి గౌతమ్ చాలా జోష్‌తో, యాక్టివ్‌గా, సరదాగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే రష్మీపై ఎవరు ఎన్ని విమర్శలు చేసిన, పంచ్‌లు వేసిన కూడా పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటుంది ఈ భామ. సోషల్ మీడియాలో యానిమల్స్, పెట్స్, డాగ్స్ విషయంలోనూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది.
Rashmi Gautam ఏంటి సమస్య..
అయితే రష్మీ ఎప్పుడూ నెగటివ్ యాంగిల్‌లో ఆలోచించదు. అందుకు కారణం ఆమెకి ఓ అనారోగ్య సమస్య ఉందట. ఓ అరుదైన వ్యాధితో రష్మి బాధపడుతుందట. ఆమె `రూమటాయిడ్ సమస్య`తో బాధపడుతుందట. ఇదోక ఆటో ఇమ్యూన్ సమస్య. దీని కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. దీనికారణంగా రష్మి బరువు పెరగడం, తగ్గడం చేస్తుందట. దీనిపై ఓ నెటిజన్ రష్మిని ప్రశ్నించారు. తన భర్త కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాడు, దానికి చికిత్స ఏంటని అడిగింది. దీనికి రష్మి రియాక్ట్ అవుతూ సలహాలిచ్చింది. తాను ఇటీవల ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా స్టెరాయిడ్స్ తీసుకున్నాను.
12ఏళ్ల వయసులో ఈ వ్యాధి తీవ్రతని తగ్గించేందుకు తీవ్రంగా నొప్పి ఉండే ఇంజిక్షన్లు తీసుకున్నట్టు తెలిపింది. రష్మి వాళ్ల అమ్మ కొన్ని చిట్కాలు చెప్పిందట. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానని తెలిపింది రష్మి. ఒత్తిడి తగ్గించుకోవాలని, నెగటివిటీకి దూరంగా ఉండాలని, పాజిటివ్ మైండ్‌తో ఉండాలని చెప్పింది. నెగటివ్ ఉండేవాళ్లకి, వెనక్కి నెట్టేవాళ్లకి దూరంగా ఉండాలని చెప్పింది రష్మి. అయితే ఇది ఆరేళ్ల క్రితం నాటి విషయం కాగా, ఇప్పుడు రష్మీ ఆరోగ్యం అలానే ఉందా, లేకుంటే కుదుట పడిందా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.