Rashmika Mandanna and Vijay Deverakonda : దిల్ రాజు సోదరుడు కుమారుడు పెళ్లి రిసెప్షన్‌లో కలిసి వచ్చిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ..!
Rashmika Mandanna and Vijay Deverakonda : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ నెల 14న రాజస్థాన్లోని జైపూర్ లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ లో టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహ వేడుకకు పలువురు టాలీవుడ్ సినీ తారలు కూడా హాజరయ్యారు. ఏపీకి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైతా రెడ్డిని ఆశిష్ పెళ్లాడారు. అయితే తాజాగా ఈ జంట తమ రిసెప్షన్ ను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకను హైదరాబాదులో నిర్వహించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 23న ఈ రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ రిసెప్షన్ కి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఆశిష్ రెడ్డి రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ వేడుకకు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అయితే వీరిద్దరూ కలిసి వచ్చినట్లుగా లేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొత్త జంటకు విషెస్ తెలిపారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ కలిసి వచ్చారని రూమర్స్ వస్తున్నాయి. మనకు తెలిసిందే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య లవ్ ఎఫైర్ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ రిసెప్షన్ కు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న కలిసి వచ్చారని రూమర్స్ వైరల్ గా మారాయి. రష్మిక మందన, విజయ్ దేవరకొండ జంటకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇద్దరి కాంబినేషన్లో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చాయి.
అయితే వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై రష్మిక విజయ్ దేవరకొండ ఎక్కడ స్పందించలేదు కానీ కొన్నిసార్లు అది రుజువు అయింది. ఈ క్రమంలోనే మరోసారి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారని అందుకే రిసెప్షన్ కు కలిసి వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇక దిల్ రాజ్ సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి తెలుగులో రౌడీ బాయ్స్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. 2022 లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆశిష్ రెడ్డి సెల్ఫీస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి విశాల్ కాళీ దర్శకత్వం వహిస్తున్నారు.