Rashmika Mandanna : రష్మిక సెన్సేషనల్ పోస్ట్ .. ఎవరిని ఉద్దేశించి పెట్టినట్లు..!!

Authored By aruna | The Telugu News | Published on: December 19, 2023, 6:00 pm
  •  Rashmika Mandanna : రష్మిక సెన్సేషనల్ పోస్ట్ .. ఎవరిని ఉద్దేశించి పెట్టినట్లు..!!

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ‘ఛలో ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస సినిమా చేస్తూ కుర్ర కారు హృదయాలను దోచుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2 లో నటిస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ రన్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ కలక్షన్స్ రాబడుతుంది. ఇక రష్మిక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. వివిధ రకాల ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటాయి.

తాజాగా రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా.. నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్ ‘ అని ఆమె ఓ కొటేషన్ ను పోస్ట్ చేశారు. దీంతో ఎవరు ఆ వ్యక్తి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెవరు ఉంటారు విజయ్ దేవరకొండ కోసమే రష్మిక ఇలా పోస్ట్ చేసి ఉంటారని కొందరు కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కామెంట్స్ చేశారు. మరి ఆమె ఎవరిని ఉద్దేశించి ఇలా పోస్ట్ చేశారో క్లారిటీ లేదు. ఆమె జీవితంలోకి ముఖ్యమైన వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారు. అందుకే ఆమె ఇలా పోస్ట్ చేసి ఉంటారని తెలుస్తుంది. తను ప్రేమించిన వ్యక్తిని ఉద్దేశిస్తూ రష్మిక ఇలా పోస్ట్ చేసి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం రష్మిక ‘ పుష్ప 2 ‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2024 లో ఆగస్టు 15న విడుదల కానుంది. ఇంకా విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయనున్నారు. అలాగే కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల , సూపర్ స్టార్ ధనుష్ సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నట్లు తెలుస్తుంది. రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాలో కూడా చేస్తున్నారు. ఇంకా లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ రెయిన్ బో ‘ లో కూడా రష్మిక నటించనున్నారు. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే చియాన్ విక్రమ్ సినిమాలో కూడా రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కన్నడ బ్యూటీ అయిన రష్మిక పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.

aruna

No bio available for this author.

  1. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  2. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  3. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  4. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

  5. "Old 5 Rupee Note : పాత రూ.5 నోటుకు రూ.17 లక్షలు.. మూడు రోజుల్లో రైతుకు ఏం జ‌రిగిందంటే..?"

  6. "Rahul Gandhi : ఏపీలో ‘ఓటు చోరీ’ కలకలం.. రాహుల్ గాంధీ కామెంట్స్‌తో వైసీపీ-కాంగ్రెస్ మధ్య మంటలు..!"

  7. "Anchor Rashmi Gautam : ఇలాంటి ప్రపంచంలో నేను బతకలేను.. జబర్దస్త్ రష్మి భావోద్వేగం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp