Rashmika Mandanna : ఒక్క ఫోటో తో రష్మిక మందన్న పేరెంట్స్ కి పిచ్చ కోపం వచ్చింది .. విజయ్ దేవరకొండ తో పెళ్లి అయిపోయింది ?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 23, 2022, 1:40 pm

Rashmika Mandanna :  తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీ విజయ్ దేవరకొండ కు మరియు రష్మిక మందన్నకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. సినిమాల పరంగా ఇద్దరు ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్ లో కాంపిటిషన్ ఇస్తూ తమదైన స్టైల్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా రష్మిక మందన ను చూసుకుంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఏకంగా ఏడు బడా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ మధ్యన విడుదలైన పుష్ప సినిమా తో ఈమె క్రేజ్ ఆల్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయిందని చెప్పాలి. ఇక మన రౌడీ విజయ్ దేవరకొండ కూడా తక్కువ ఏం కాదు. రీసెంట్ గా రిలీజ్ అయిన లైగర్ ప్లాప్ అయినా సరే తన నెక్స్టు సినిమా ఖుషి కి డిజిటల్

రైట్స్ ని తిసుకుని ఇండస్ట్రీలో గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇది ఇలా ఉండగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన గీతగోవిందం సినిమాలో రష్మిక విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది అని చెప్పాలి. ఇది చూసిన తర్వాత అందరూ వీరు నిజంగానే లవ్ లో ఉన్నారు అని అనుకున్నారు. ఇక తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బీభత్సంగా ఉండడంతో ఇక వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. అలాగే ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరు కలిసి తిరగడం, వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ఎఫైర్ ఉందని అందరూ అనుకునేలా చేసింది. ఇక వీరిద్దరూ కలిసి ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Rashmika Mandanna Vijay Deverakonda married pic leaked on social media

Rashmika Mandanna Vijay Deverakonda married pic leaked on social media

ఈ క్రమంలోనే రీసెంట్ గా నెట్టింట ఓ ఫోటో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక పూలమాల వేసుకొని ఆనంద పడుతూ ఫోటో దిగారు. దీంతో ఈ ఫోటో చూసినవారు విజయ్ దేవరకొండడ రష్మీక మందన ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అంటూ షాక్ అవుతున్నారు. ఈ ఫొటోస్ చూసి నిజంగానే పెళ్లయిపోయిందేమో అని అనుకుంటున్నారు. అయితే నిజానికి ఇది ఒక ఫ్యాన్స్ ఎడిట్ అని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫోటోను క్రియేట్ చేశారని, వీరి పెళ్లి అనేది కల్పితమని జనాలు చెప్తున్నారు. మరి ఈ విషయంపై రష్మిక మందన విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp