Biggboss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో వారంలో ప్రస్తుతం 12 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇంకా 13 వారాలు ఉంది. అయితే.. ఇంకో కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కానీ.. ఆ కంటెస్టెంట్ ఎవరో మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ మెట్స్ గా ఫిక్స్ అయ్యారు. మొదటి కంటెస్టెంట్ గా ఆట సందీప్, రెండో కంటెస్టెంట్ గా శివాజీ ఫిక్స్ అయిపోయారు. ఇక.. మూడో వారం నామినేషన్ల విషయానికి వస్తే ఈ వారం నామినేషన్లు కూడా చాలా హీటెక్కించాయి.

శని, ఆదివారం రెండు రోజులు నాగార్జున కంటెస్టెంట్లు అందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా మళ్లీ నామినేషన్ల దగ్గర గొడవ స్టార్ట్ అయింది. ముఖ్యంగా రతిక.. శుభశ్రీ, గౌతమ్ ను నామినేట్ చేసింది. నువ్వు కేవలం రోటీలు చేస్తే కాదు.. అన్ని పనులు చేయాలి. నువ్వు ఇప్పటి వరకు నామినేషన్లలో లేవు. ఆ బాధ కూడా తెలియాలి అంటూ నామినేట్ చేసింది రతిక. అంతకుముందే శుభశ్రీని అమర్ దీప్ నామినేట్ చేశాడు. అమర్ దీప్ కూడా సేమ్ రీజన్. నువ్వు రోటీలు మాత్రమే చేస్తే కాదు. అన్ని పనులు చేయాలి అంటూ నామినేట్ చేశాడు.
Biggboss Telugu 7 : హాట్ వాటర్ తీసుకురా అని గౌతమ్ అన్నందుకు నామినేట్ చేసిన రతిక
ఇక.. గౌతమ్ ను రెండో వ్యక్తిగా నామినేట్ చేసిన రతిక.. హాట్ వాటర్ తీసుకురా అని నువ్వు నన్ను అన్నావు. అలా ఎలా అంటావు.. అంటూ నామినేట్ చేసింది. నీకు ఏం తాగాలనిపించినా.. నువ్వు పని చేసుకోవాలి. కానీ.. ఇక్కడ చేసే వాళ్లు ఎవరూ లేరు. బెడ్ రూమ్ లో కూర్చొని హాట్ వాటర్ తీసుకొనిరా అంటే.. ఎవ్వరూ తీసుకొని రారు. ఇక్కడ నీ పనివాళ్లు ఎవ్వరూ లేరు అంటూ నామినేట్ చేయడంతో గౌతమ్ కు కోపం వస్తుంది. అప్పుడే నువ్వు నాకు చెప్పాల్సింది కదా. ఎందుకు నువ్వు అప్పుడు నాకు చెప్పలేదు. దాన్ని సాకుగా చూసి నామినేషన్ వేస్తావా? నేను నీకు ఆమ్లెట్ వేయలేదా? నీకోసం ఆరోజు టాస్క్ లో ఆర్ధగంట సేపు నిలబడ్డా. నేనెందుకు నిలబడ్డా. పనిలేకనా.. అంటూ గౌతమ్ సీరియస్ అవుతాడు. అలా రతిక మరోసారి బిగ్ బాస్ హౌస్ లో హాట్ టాపిక్ అయింది.