Ravi Teja : రవితేజ స్టార్ హీరో కాకుండా చేయాలని పెద్ద ప్లాన్ వేసిన ఓ హీరో .. కానీ చివరికి ?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravi Teja : రవితేజ స్టార్ హీరో కాకుండా చేయాలని పెద్ద ప్లాన్ వేసిన ఓ హీరో .. కానీ చివరికి ??

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2023,8:00 pm

Ravi Teja : సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సొంతంగా పైకి వచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకరే మాస్ మహారాజా రవితేజ. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే ఒకానొక టైంలో క్రేజీ హీరోగా మారిపోయాడు. బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లను అందుకున్నాడు. ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రవితేజ ఆ సినిమాలతో స్టార్ హీరో అయ్యాడు.

ఒకానొక టైంలో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కంటే రవితేజతో చేయాలని దర్శకులు ఆసక్తి చూపించేవారు. అయితే ఆ సమయంలో రవితేజ కెరీర్ ను దెబ్బతీయాలని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఓ వ్యక్తి బాగా ట్రై చేశారట. రవితేజ వద్దకు డైరెక్టర్స్ వెళ్తుంటే ఆపి మరి ఆయనతో సినిమా చేయొద్దు అని అంతకంటే తక్కువ రెమ్యూనరేషన్ తో మరో హీరో సినిమా చేస్తాడని మంచి కథలను రవితేజ వద్దకు పంపించకుండా చేసేవారట. ఆ విధంగానే రవితేజ హీరోగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అయితే కొన్నాళ్లకు మళ్ళీ స్టార్ హీరోగా మారాడు.

Ravi Teja career starting problems in industry

Ravi Teja career starting problems in industry

ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో రవితేజ 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఇలా రవితేజ మళ్ళీ స్టార్ హీరోగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక రవితేజ వరుస సినిమాలు చేస్తూ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా చేస్తున్నారు. ధమాకా సినిమాతో హిట్ కొట్టిన రవితేజ రావణాసుర సినిమాతో మళ్లీ ఫ్లాప్ అయ్యారు. మరి తర్వాత వచ్చే సినిమాతో అయినా రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది