Ravi Teja : మైండ్ బ్లోయింగ్ బ్రేకింగ్ న్యూస్.. రవితేజ ఆస్తుల విలువ తెలిస్తే రాత్రికి మీకు నిద్ర పట్టదు !
Ravi Teja : మాస్ మహరాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. తనదైన చిత్రాలతో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఓ రేంజ్‌లో అలరించిన అతడు.. మాస్ మహారాజాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ రీసెంట్‌గా ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలు చేసి మంచి విజయాలని తన ఖాతాలో వేసుకున్నాడు. పూరి జగన్నాథ్ తో చేసిన సినిమాలు అతని కెరీర్ కి బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పొచ్చు.
రవితేజనా, మజాకానా? ఎప్పటి నుండో సినిమాలు చేస్తూ వస్తున్న రవితేజ ఎన్ని ఆస్తులు కూడబెట్టాడు అనేది ఇప్పటికీ సస్పెన్స్ క్రియేట్ చేసే అంశమే. అయితే రవితేజా ఇన్నేళ్ళ కెరీర్ లో బాగానే ఆస్తులు సంపాదించాడు అని చెప్పాలి. అతని ఇల్లు ధర తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు . 12 కోట్లు ఖరీదు చేసే ఇంట్లో ఆయన ఉంటున్నట్టు తెలుస్తుంది.. రవితేజా గురించి సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో హీరోగా నటించిన కమల్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కెరియర్ మొదట్లో తాను
హైదరాబాదులో తనకు ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలని అనుకున్నారని, కాని ఇప్పుడు అంత ఖరీదు చేసే ఇంట్లో ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీ ఇస్తున్న రవితేజ ఆరోగ్యం బాగాలేక పోయిన జిమ్ చేస్తూ ఉంటాడు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే రవితేజ బాగానే కూడబెట్టాడని తెలుస్తుంది. అతను ఇప్పుడు వంద కోట్ల క్లబ్‌లో చేరగా, ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూనే ఉన్నాడు. ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ .. ఆ తర్వాత నటించిన వాల్తేరు వీరయ్య తో కూడా తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.