Varshini : అవి విన్నాక నా పరిస్థితి ఇంతే.. యాంకర్ వర్షిణి పోస్ట్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varshini : అవి విన్నాక నా పరిస్థితి ఇంతే.. యాంకర్ వర్షిణి పోస్ట్ వైరల్

 Authored By aruna | The Telugu News | Updated on :19 August 2022,6:00 pm

Varshini : యాంకర్ వర్షిణి ప్రస్తుతం బుల్లితెరపై ఎలాంటి షోలు చేయడం లేదు. ఆమె ఎక్కువగా వెండితెరపైనే ఫోకస్ పెట్టేసింది. చేస్తే సినిమాలు లేదంటే ఖాళీ అన్నట్టుగా ఉంటోంది. అలా అని ఆమెకు పెద్ద సినిమా ఆఫర్లు ఏమీ రావడం లేదు. వచ్చిన చిత్రాలు కూడా సరిగ్గా ఆడటం లేదు. ఎన్నో అంచనాల నడుము వచ్చిన మళ్లీ మొదలైంది సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది. వర్షిణి సుమంత్ పక్కన నటించింది. కానీ ఆమె పాత్రకు ఎలాంటి గుర్తింపు రాలేదు. సినిమా ఫ్లాప్ అవ్వడంతో వర్షిణి పాత్ర కూడా అందులో కలిసి పోయింది.

ప్రస్తుతం వర్షిణి ఆశలన్నీ కూడా సమంత నటించిన శాకుంతలం సినిమా మీదే ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఊసే లేకుండా పోయింది. అసలు శాకుంతలం సినిమా ఉందా? లేదా? అన్నట్టుగా మారిపోయింది. శాకుంతలం సినిమా షూటింగ్ అయితే ఎప్పుడో అయిపోయింది. కానీ ఇంకా ఏ చిన్న అప్డేట్ కూడా లేదు. ఇక ఇప్పుడు వర్షిణి మరో కొత్త ప్రాజెక్ట్ గురించి ప్రకటించింది. శివ కందుకూరి హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో వర్షిణి కూడా నటిస్తోంది. ఇలా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కాలం గడిపేస్తోంది.ఇక ఇప్పుడు సాధారణ జనాలు, సినీ జనాలు అని తేడా లేకుండా.. అందరూ కూడా సీతారామం మాయలో పడిపోయారు.

Anchor Varshini After Listing Sita Ramam Songs

Anchor Varshini After Listing Sita Ramam Songs

ఎన్ని సార్లు చూసినా తనివి తీరని చిత్రంగా సీతారామం నిలిచింది. చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ సినిమాను చూస్తున్నారు. ఇక పాటలు అయితే ఇప్పుడు అందరి మెదళ్లలో తిరుగుతున్నాయి. లూప్ మోడ్‌లో అన్నట్టుగా అందరూ ఆ పాటలను వింటూనే మైమరిచిపోతోన్నారు. తాజాగా వర్షిణి కూడా ఈ మేరకు ఓ పోస్ట్ వేసింది. సీతారామం పాటలు విన్నప్పటి నుంచి నా పరిస్థితి ఇంతే అన్నట్టుగా ఓ ఫన్నీ పోస్ట్ వేసింది.పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో వర్షిణికి మంచి ఇమేజ్ ఏర్పడింది. ఆతరువాత బుల్లితెరపైకి ఢీ షోతో ఎంట్రీ ఇచ్చింది. ఢీ షోతో వర్షిణి మరింత క్రేజ్ సంపాదించుకుంది. చివరకు కామెడీ స్టార్స్ షోకు సోలో యాంకర్‌గా అవకాశం వచ్చింది. అక్కడ చేస్తుండగానే.. సినిమాలు అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో అది మానేసి వెళ్లిపోయింది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది