Ravi Teja : అల్లు అర్జున్ కి దెబ్బ కొట్టిన రవితేజ.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravi Teja : అల్లు అర్జున్ కి దెబ్బ కొట్టిన రవితేజ.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :24 January 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Ravi Teja : అల్లు అర్జున్ కి దెబ్బ కొట్టిన రవితేజ.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!

Ravi Teja : పుష్ప 2 తో Pushpa 2  పాన్ ఇండియా Pan India బ్లాక్ బస్టర్ అందుకున్న Allu Arjun అల్లు అర్జున్ పుష్ప 3 Pushpa 3 Movie చేయాల్సి ఉన్నా అది మరో ఐదేళ్ల తర్వాత చేస్తాడని తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా త్రివిక్రం తో చేయాల్సి ఉంది. ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఎప్పుడో వచ్చింది. పుష్ప 2 తో నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న Allu Arjun  అల్లు అర్జున్ త్రివిక్రం సినిమాని కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఐతే అల్లు అర్జున్ సినిమా చేస్తాడని అనుకున్న త్రివిక్రం సడెన్ గా మాస్ మహారాజ్ రవితేజతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. మాస్ రాజా రవితేజ, త్రివిక్రం ఈ కాంబో సినిమా పడితే అదిరిపోతుందని ఎన్నాళ్ల నుంచో ఆడియన్స్ అనుకుంటున్నారు. కానీ సరైన టైం రానిదే ఏది జరగదు అన్నట్టుగా ఇన్నాళ్లకు ఈ కలయిక లో సినిమా రాబోతుందని తెలుస్తుంది.

Ravi Teja అల్లు అర్జున్ కి దెబ్బ కొట్టిన రవితేజ ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా

Ravi Teja : అల్లు అర్జున్ కి దెబ్బ కొట్టిన రవితేజ.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!

Ravi Teja : సితార బ్యానర్ కూడా భారీ సినిమాలు..

అల్లు అర్జున్ సినిమా మొదలు పెట్టేలోగా త్రివిక్రం రవితేజ తో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రం ఇదివరకు సినిమాలన్నీ కూడా హారిక హాసిని బ్యానర్ లో చినబాబు నిర్మించారు. ఇప్పుడు సితార బ్యానర్ కూడా భారీ సినిమాలు చేస్తుంది. అందుకే సితార లోనే త్రివిక్రం రవితేజ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ త్వరలో రాబోతుంది. త్రివిక్రం రవితేజ ఈ కాంబో సినిమా పడితే మాత్రం ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. రవితేజ కూడా ప్రస్తుతం మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. త్రివిక్రం పంచ్ డైలాగ్ లతో రవితేజ ఫ్యాన్స్ ని ఊగిపోయేలా చేస్తాడని చెప్పొచ్చు. ఈ కాంబో మాస్ రాజా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. Raviteja, Allu Arjun, Trivikram, Sitara Entertainments, Tollywood

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది