Raja Saab Collections : ‘రాజాసాబ్’ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
Raja Saab Collections : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం, విడుదలకు ముందే భారీ అంచనాలను నెలకొల్పగా, ఇప్పుడు ఆ అంచనాలను అందుకునే దిశగా దూసుకుపోతోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ వెబ్‌సైట్ ‘Sacnilk’ గణాంకాల ప్రకారం, ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే భారతదేశం అంతటా రూ. 108.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ప్రభాస్ గ్లోబల్ స్టార్డమ్‌ను మరోసారి నిరూపించింది. ముఖ్యంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఉత్తరాది ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
తొలి రోజే రూ. 112 కోట్లకు పైగా గ్రాస్
కలెక్షన్స్ వివరాలను లోతుగా చూస్తే, సినిమా ప్రారంభం నుండే జోరు చూపించింది. అమెరికా మరియు ఇతర ప్రాంతాలలో జరిగిన ప్రీమియర్ షోల ద్వారా రూ. 11.3 కోట్లు రాగా, తొలి రోజు దేశీయంగా రూ. 64.3 కోట్లు వసూలు చేసి ప్రభాస్ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. రెండో రోజు సాధారణంగా వచ్చే తగ్గుదల ఉన్నప్పటికీ, రూ. 32.84 కోట్లు రాబట్టి స్థిరత్వాన్ని ప్రదర్శించింది. ఇక హిందీ మార్కెట్‌లో ప్రభాస్ మార్కెట్ క్రమంగా పెరుగుతుండటంతో, అక్కడ కేవలం రెండు రోజుల్లోనే రూ. 11.2 కోట్లు సాధించడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, తొలి రోజే రూ. 112 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. వాస్తవానికి అభిమానుల అంచనాలను సినిమా ఆదుకోలేకపోయినప్పటికీ , ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయంటే అది కేవలం ప్రభాస్ కటౌట్ చూసే..సినిమా బాగుండి ఉంటె బాక్స్ ఆఫీస్ వద్ద ఉచకోతే ఉండేది. మరి సంక్రాంతి తర్వాత సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటి అనేది చూడాలి.