రేఖకు లైన్ వేసిన సల్మాన్.. ఆ కథ భలేగా ఉంది! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

రేఖకు లైన్ వేసిన సల్మాన్.. ఆ కథ భలేగా ఉంది!

బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, పెళ్లి కాని ప్రసాద్ ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా అది సల్మాన్ ఖాన్‌కు సరిగ్గా సరితూగుతుంది. 55 ఏళ్లు నిండిన సల్మాన్ ఖాన్ పెళ్లి టాపిక్ నిత్యం చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. ఈ బ్రహ్మచారి ప్రేమల్లో మునిగి తేలుతుంటాడు. కానీ పెళ్లి పీటల వరకు ఆ వ్యవహారం రాకుండానే మధ్యలో ముగిసిపోతుంది. వీటిపై సల్మాన్ ఏనాడూ కూడా నోరు విప్పలేదు. ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌లతో సల్మాన్ నడిపించి […]

 Authored By uday | The Telugu News | Updated on :28 December 2020,4:30 pm

బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, పెళ్లి కాని ప్రసాద్ ఇలా ఎన్ని రకాలుగా పిలిచినా అది సల్మాన్ ఖాన్‌కు సరిగ్గా సరితూగుతుంది. 55 ఏళ్లు నిండిన సల్మాన్ ఖాన్ పెళ్లి టాపిక్ నిత్యం చర్చల్లోకి వస్తూనే ఉంటుంది. ఈ బ్రహ్మచారి ప్రేమల్లో మునిగి తేలుతుంటాడు. కానీ పెళ్లి పీటల వరకు ఆ వ్యవహారం రాకుండానే మధ్యలో ముగిసిపోతుంది. వీటిపై సల్మాన్ ఏనాడూ కూడా నోరు విప్పలేదు.

Rekha Salman khan Crush Story

Rekha Salman khan Crush Story

ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌లతో సల్మాన్ నడిపించి ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. తనను లాగి పెట్టి కొట్టాడని, శాడిస్ట్‌లా హింసించాడని ఐశ్వర్యా రాయ్ ఆ మధ్య సల్మాన్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను కొడితే అసలు బతుకుతారా? అంటూ సల్మాన్ కూడా రివర్స్ కౌంటర్ వేశాడు. అసలు ఈ వివాదాం పక్కన పెడితే.. సల్మాన్ ఖాన్‌కు సీనియర్ హీరోయిన్ రేఖపై ఉన్న క్రష్ గురించి ఆ మధ్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

సల్మాన్ ఖాన్ తన టీనేజ్‌లో రేఖ చుట్టూ తిరిగే వాడట. ఆమె యోగా క్లాసులు చెబుతుందని పనిగట్టుకుని మరీ వెళ్లేవాడట. అతను నాతో ప్రేమలో పడ్డాడని ఆ వయసులో అతనికి తెలుసో లేదో కానీ నాకు మాత్రం తెలుసంటూ రేఖ చెప్పుకొచ్చింది. నేను పెద్దయ్యాక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఇంట్లో వాళ్లతో చెప్పేవాడంటూ సల్మాన్ చిలిపి చేష్టల గురించి రేఖ తెలిపింది. అందుకే నేను పెళ్లి చేసుకోలేదేమో అని రేఖపై సల్మాన్ సెటైర్ వేశాడు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది