Renu Desai : ఇది స్వర్గానికి దారేనా?.. ఫుల్ చిల్ అవుతోన్న రేణూ దేశాయ్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 30 June 2022, 5:30 pm

Renu Desai : రేణూ దేశాయ్ ఎక్కువగా వెకేషన్లకు వెళ్లదు. అకీరా నందన్, ఆద్యలు కూడా ఎక్కడికి వెళ్లరు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే.. ఇక్కడే ఇండియాలోనే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈషా ఫౌండేషన్, సద్గురు అంటూ రేణూ దేశాయ్ తిరుగుతుంటుంది. లేదంటే రేణూ దేశాయ్ కాశీ యాత్ర చేస్తుంటుంది. కానీ బయటి దేశాలకు అంతగా వెళ్లదు. కానీ ఇప్పుడు మాత్రం రేణూ దేశాయ్ తన పిల్లలను తీసుకుని వెకేషన్‌కు వెళ్లింది. అది కూడా ఇక్కడ చుట్టు పక్కల ఉన్న ఊర్లకు కాదు. ఏకంగా స్కాట్ లాండ్‌కు తీసుకెళ్లింది. అలా మొత్తానికి స్కాట్ లాండ్‌లో రేణూ దేశాయ్ తన పిల్లలతో కలిసి ఫుల్ చిల్ అవుతోంది.

ఇక అక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్న తీరు, ఈ అన్నాచెల్లెళ్ల గొడవలకు సంబంధించిన ఫోటోలను, విషయాలను రేణూదేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తోంది. అకీరా నందన్ తన గ్రాడ్యుయేషన్‌ ప్లస్ 2ను పూర్తి చేసేసుకున్నాడు. దీంతో ఈ వెకేషన్‌ను ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ గెస్టుగా వచ్చాడు. స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అకీరా నందన్ ప్లే చేసిన సాంగ్, పియానో మీద దోస్తీ పాటను వాయించి అందరినీ మెప్పించాడు.

Renu Desai Akira Nandan Aadya Enjoys in Scottland

Renu Desai Akira Nandan Aadya Enjoys in Scottland

తన ఫ్రెండ్స్‌కి అంకితం అన్నట్టుగా వాయించేశాడు. ఆ వీడియో తెగ వైరల్ అయింది. ఇక అంతేకాకుండా ఇంగ్లీష్‌లో అకీరా నందన్ ఇచ్చిన స్పీచ్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ఇప్పుడు అకీరా, ఆద్య, రేణూ దేశాయ్‌లు మాత్రం స్కాట్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడి అందాలను చూసుకుంటూ వాళ్లంతా గాల్లో తేలిపోతోన్నట్టున్నారు. ఇక అక్కడి రోడ్లను చూసి రేణూ దేశాయ్ అవాక్కయినట్టుుంది. ఇదే స్వర్గానికి దారా?.. ఈ దారే స్వర్గంలా అనిపిస్తుందా? అని రేణూ దేశాయ్ ఓ పోస్ట్ వేసింది. మొత్తానికి స్కాట్లాండ్ దేశాన్ని చూసి రేణూ దేశాయ్ ముచ్చటపడుతున్నట్టుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి