Renu desai : కొడుకు అకీరా నందన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్..!
Renu desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. సినిమాలకు దూరం అయిన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కొడుకు అకీరానందన్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు అలరిస్తూ ఉంటారు. అయితే చాలా గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించారు. ఈ సినిమాలో హేమలత అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ లో జరుపుకుంటుంది. […]

Renu desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. సినిమాలకు దూరం అయిన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన కొడుకు అకీరానందన్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు అలరిస్తూ ఉంటారు. అయితే చాలా గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించారు. ఈ సినిమాలో హేమలత అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ లో జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ కాసేపు మీడియాతో ముచ్చటించారు. సినిమాతో పాటు పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. పవన్ తనయుడు అకీరా నందన్ హీరో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కానీ అకిరాకి సినిమాపై ఆసక్తి లేదని, హీరో అవ్వడని ఆల్రెడీ రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అఖీరా అమెరికాలోనే ఫిల్మ్ స్కూల్లో మ్యూజిక్ ఇంకొన్ని కోర్సులు నేర్చుకుంటున్నాడు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో అకీరా నందన్ హీరో అవ్వడు అతడికి నటనపై ఆసక్తి లేదని మరోసారి క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే తల్లిగా మీకు అకిరానందన్ ను ఎలా చూడాలని ఉంది అని అడిగితే అకిరా ఒక పెద్ద స్టేడియంలో వందల మంది ముందు పియానో వాయిస్తే చూడాలని ఉంది. అలాగే ఏ తల్లి అయినా సరే తన కొడుకుని స్క్రీన్ పైన చూడాలని అనుకుంటుంది కానీ అకిరా ఏమి అవ్వాలనుకుంటున్నాడో తన ఇష్టం.
అకిరా యాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పిన మరేదైనా అవ్వాలని చెప్పినా సరే ఓకే చెబుతాను అని చెప్పింది రేణు దేశాయ్. ఇక అకిరా పియానో వాయిస్తాడని అందరికీ తెలిసిందే. గతంలో పలుసార్లు అకిరా పియానో వాయించిన వీడియోలను రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే అకిరా ఓ షార్ట్ ఫిలిం కి సంగీత దర్శకత్వం వహించారు. మరి అకీరా భవిష్యత్తులో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడేమో చూడాలి. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో అకిరానందన్ గురించి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. పవర్ స్టార్ తనయుడు అయిన అఖీరానందన్ హీరో అవ్వాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కానీ అతడికి ఇంట్రెస్ట్ లేదని తెలుస్తుంది. మరి మ్యూజిక్ డైరెక్టర్గా అయినా సక్సెస్ అవుతాడేమో చూడాలి.