Akira Nandan : అకీరా నందన్ హీరోగా ఖుషీ2.. రేణూ దేశాయ్ కామెంట్స్ ఏంటి..!
ప్రధానాంశాలు:
Akira Nandan : అకీరా నందన్ హీరోగా ఖుషీ2.. రేణూ దేశాయ్ కామెంట్స్ ఏంటి..!
Akira Nandan : పవన్ కళ్యాణ్ Pawan Kalyan తనయుడు అకీరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పవర్ స్టార్ Pawan Kalyan పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉన్నారు. దీంతో తన కొత్త సినిమాలకు బ్రేక్ పడింది. కానీ.. తన అభిమానులు కొరకు, గతంలో తాను ఇచ్చిన మాట మేరకు సమయం దొరికినప్పుడల్లా షూటింగ్లో పాల్గొని ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. అయితే పవన్ నటించకపోయిన పవన్ తనయుడు అకీరా ఆ లోటుని భర్తీ చేస్తాడని అనుకుంటున్నారు…
Akira Nandan నేను వెయిటింగ్..
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ‘ఓజీ’లో నటిస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అకీరా నందన్ హైట్ కూడా చాలా పెద్దగా ఉన్నాడు. ఆయన లుక్, రీసెంట్ పరిణామాలు చూస్తుంటే అకీరా నందన్ హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్ జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా అకీరాతో `ఖుషి 2` సినిమా చేయడంపై దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌తో ఆయన `ఖుషి` సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇది సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోఇప్పుడు `ఖుషి 2`కి సంబంధించిన చర్చ స్టార్ట్ అయ్యింది.
ఖుషి 2` సినిమా అకీరా నందన్‌తో చేస్తారనే ప్రశ్న తలెత్తింది. దీనికి సూర్య రియాక్ట్ అవుతూ, ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను ఫ్లైట్‌లో చూశాను. అద్భుతంగా అనిపించాడు. పవన్ కళ్యాణ్ లానే అప్పుడే పుస్తకాలు పట్టుకుని చదువుతున్నాడు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే.. టైం కలిసి వస్తే.. ఖుషీ2 జరుగుతుందేమో చూడాలి` అనిచెప్పారు. అదే సమయంలో రేణూ దేశాయ్ తన తనయుడు మూవీ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అకీరా నందన్ సినిమాల్లోకి రావాలని నేనూ కోరుకుంటున్నాను. తల్లిగా అకీరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా అని నాకూ ఆత్రుతగా ఉంది. అకీరా నందన్ ఇష్టంతోనే సినిమాల్లోకి వస్తాడు” అని చెప్పారు.