Renu Desai : రెండో పెళ్లి చేసుకోబోతున్న రేణు దేశాయ్.. నన్ను ఆశీర్వదించండి అంటూ పోస్ట్..!

Authored By aruna | The Telugu News | Published on: October 19, 2023, 9:00 pm

Renu Desai : నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ‘ బద్రి ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రేణు దేశాయ్ అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు. తన పిల్లల గురించి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అవి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా రేణు దేశాయ్ రెండో పెళ్ళి చేసుకోబోతుంది అని వార్తలు వస్తున్నాయి.

తను నిశ్చితార్థం చేసుకున్నది నిజమేనని అలా అని అది ఆగిపోలేదని మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని రేణు దేశాయ్ అన్నారు. తన కుమార్తె కొంచెం పెద్దయ్యాక బాధ్యతలు తీరాక పెళ్లి చేసుకుంటా అని మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు తాను ఎమోషనల్ గా చాలా ఇబ్బంది పడ్డ అని ఇప్పుడు అన్ని విధాల బలోపేతం అయ్యా అని అన్నారు. సోషల్ మీడియా పవర్ఫుల్ మీడియా అని దాంట్లో కొంచెం చెడు ఉన్న మాట నిజమే అని, అలా అని దూరంగా ఉండకుండా మార్చడానికి ప్రయత్నిస్తున్నా అని అన్నారు. ఈ పని ఎవరో ఒకరు చేయాలి కదా అందుకే నేను చేస్తున్నా అని అన్నారు.

renu desai second marriage news

renu desai second marriage news

సినిమాలు నిర్మించడానికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా అని ప్రస్తుతం రెండు చిన్న సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయని, ఆ తర్వాత భారీ సినిమా కోసం మంచి యాక్షన్ కథ రెడీ చేశానని రేణు అన్నారు. మంచి కథ, మంచి బ్యానర్, మంచి దర్శకుడు ఈ మూడు కాంబినేషన్ లు సెట్ అయితేనే సినిమాలు చేస్తా అని అన్నారు. గతంలో మంచి స్క్రిప్టులు వచ్చిన ఈ మూడు సెట్ కాక నే చేయలేదు అన్నారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేస్తున్నా అని తన గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఈ వ్యాపారం ఉందని అదే కొనసాగిస్తున్నాను అని అన్నారు. తన కూతురు ఆర్కిటెక్ట్ కావాలని అనుకుంటుందని, ఆ దిశగానే చదువుకుంటుంది అని అన్నారు. ప్రస్తుతం పర్సనల్ విషయాల గురించి చెప్పలేనని తర్వాత ప్రెస్ మీట్ లో చెబుతానని అన్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp