Radhe Shyam : యూవీ క్రియేషన్స్ వారు భలే తప్పించుకున్నారు.. రాధేశ్యామ్ నష్టం అంతా వారికేనా!
Radhe Shyam : ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కమర్షియల్గా ఫ్లాప్. సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి అంటూ రివ్యూ ఇచ్చారు. అదే సమయంలో సినిమా బాగాలేదు అంటూ ఒక్క మాటతో మాస్ ఆడియన్స్ తేల్చి పారేశారు. ఆ ఒక్క మాట సినిమా కమర్షియల్ గా అత్యంత దారుణమైన ఫలితాన్ని చవి చూసేలా చేసింది. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కనీసం వంద కోట్ల షేర్ ని కూడా దక్కించుకునే పరిస్థితి లేదని టాక్ వినిపిస్తోంది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాని యువీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నిర్మాణ బాధ్యత పూర్తిగా యువి క్రియేషన్స్ వారు తీసుకున్నప్పటికీ అనూహ్యంగా చివరి నిమిషంలో సినిమా నిర్మాణంలో భాగస్వామ్యంగా టీ సిరీస్ ను చేసింది. దాంతో ఇప్పుడు ఎక్కువ నష్టం టీ సిరీస్ వారికే అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. టీ సిరీస్ వారు దాదాపుగా 200 కోట్లకు పైగానే ఈ సినిమాకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది.వంద కోట్ల రూపాయలు బాలీవుడ్ రైట్స్ ద్వారా వస్తాయని వారు ఆశించారు.
బాలీవుడ్ లో కనీసం పది కోట్ల వస్తువులను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ఇదే సమయంలో శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారా భారీగా లాభాలు దక్కించుకునే అవకాశం ఉందని భావించారు. కానీ ఇప్పుడు అది కూడా లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున యు.వి.క్రియేషన్స్ వారు ఈ నష్టాల నుండి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. చిన్నా చితకా సినిమాలు నిర్మించే వారు ఈ భారీ మొత్తం లో నష్టం వస్తే ముందు ముందు సినిమాల నిర్మాణం వదిలేసే వారేమో అంటూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.