RRR Movie : అంత భారీ ఈవెంట్ లో ఈ రెండు చిన్న విషయాలు హైలైట్ అయ్యాయి
RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా కర్ణాటక చిక్బలాపూర్ లో భారీ ఎత్తున జరిగింది. అక్కడి ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులు ఇంకా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో సహా ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మెగా మరియు నందమూరి అభిమానులు హాజరు కావడంతో పాటు కన్నడ సినీ ప్రేక్షకులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న హైప్ ఏంటి అనేది అక్కడ క్లియర్ గా కనిపించింది.
ఈ భారీ ఈవెంట్లో రెండు విషయాలు అత్యంత ప్రాముఖ్యతను సొంతం చేసుకున్నాయి. వాటి గురించి ప్రస్తుతం జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు విషయాల్లో మొదటి విషయానికి వస్తే రాజమౌళి మరియు నిర్మాత దానయ్య మాట్లాడుతూ ఏపీలో సినిమా టికెట్ల రేట్ల విషయంలో చిరంజీవి జోక్యం చేసుకొని వ్యవహరించిన తీరు అద్బుతం అన్నారు. ఆయనే లేకుంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యేది కాదు అన్నారు. ఆ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద చేసిన వ్యాఖ్యలు మరోసారి చిరంజీవిని ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచాయని సందేహం లేదు. ఇక రెండో విషయానికి వస్తే ఈవెంట్ జరుగుతున్న

rrr movie pre release event special updates
పరిసర ప్రాంతాల్లో ఒక భారీ స్టాండ్ పై ఎన్టీఆర్ మరియు రాంచరణ్ ఫ్లెక్సీలు జెండాలు ఎగుర వేశారు. అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన జెండాను మెగా అభిమానులు ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేశారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ జెండాను తొలగించడం జరిగింది. ఆ సమయంలో ఇరు వర్గాల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు మరియు నిర్వాహకులు కల్పించుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. పెద్ద ఎత్తున జరిగిన ఆ గొడవలో ఇద్దరు ముగ్గురు గాయపడ్డారు అనే వార్తలు వచ్చాయి.. కానీ అలాంటిదేమీ లేదు అంటూ కార్యక్రమ నిర్వాహకులు ఆ తర్వాత ప్రకటించారు. ఇలా జెండాలను పెట్టడం కరెక్ట్ కాదు అంటూ అభిమానులకు వారు తెలియజేశారు.