RRR Movie : అఫీషియల్ గా‘ఆర్ఆర్ఆర్’ న్యూ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడంటే?
RRR Movie : ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని వెయిట్ చేస్తుండగా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేశారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 8న విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది. మార్చి 18న లేదా ఏప్రిల్ 28న ఫిల్మ్ రిలీజ్ చేస్తామని ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కాగా, తాజాగా మేకర్స్ న్యూ డేట్ అనౌన్స్ చేశారు. దీంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మార్చి 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ జక్కన్నగా పేరుగాంచిన ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, సీనియర్ హీరోయిన్ శ్రియ, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. లెజెండరీ క్యారెక్టర్స్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రలను హీరోలు పోషించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి పాత్ర పోషించగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు.
రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బ్యూటిఫుల్ ఆలియా భట్ నటించగా, తారక్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ నటించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తుండగా గుడ్ న్యూస్ వచ్చేసిందని ఈ సందర్భంగా మెగా, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్, తారక్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారని ఆయా హీరోల అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.