Sadaa : సీనియ‌ర్ హీరోయిన్ టైట్ డ్రెస్‌లో ర‌చ్చ లేపుతుందిగా.. ఆ అందాల‌కు థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్

Advertisement

sadaa : రాను రాను అంటూనే చిన్న‌దో రాములోరి గుడికొచ్చే చిన్న‌దో అంటూ ఒక‌ప్పుడు కుర్ర‌కారు మ‌తులు పోగొట్టిన అందాల ముద్దుగుమ్మ స‌దా. ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌కి సిద్ధం అవుతుంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో అందాల ర‌చ్చ‌కు తెర‌లేపుతుంది. ఈ అమ్మ‌డి అందాల‌కు కుర్రాళ్లు బేజారు అవుతున్నారు. అయితే స‌దా నటిగా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. వదిన, అక్క పాత్రలు చేయడానికి సిద్దమే అంటున్నారు. హీరోయిన్ గా కొనసాగాలనే కోరిక మందిలో ఉన్నా పరిస్థితులను బట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా అయినా బిజీ కావాలనుకుంటున్నారు.

Advertisement

Sadaa : స‌దా అందాల మాయ‌..

సదా లేదా సదాఫ్ మొహమ్మద్ సయీద్.. ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది.సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టింది. ఆ సినిమాలో వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను దోచుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో సదాకు వరుస అవకాశాలు వచ్చాయి.ఇటీవల ఆమె రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. సెన్సేషనల్ విజయం సాధించిన డీజే టిల్లు సీక్వెల్ లో సదా నటిస్తున్నారు.

Advertisement
sadha mesmerizing looks viral
sadha mesmerizing looks viral

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా డీజే టిల్లు 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. సోష‌ల్ మీడియాలో సెగ‌లు రేపుతున్న స‌దా తాజాగా స్ట‌న్నింగ్ లుక్స్‌లో క‌నిపించి కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటుంది. ఇందులో స‌దా కేక‌పెట్టించే విధంగా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ మంత్ర ముగ్ధ‌లుని చేస్తుంది. ఇక తెలుగు బుల్లితెరపై కూడా సదా సందడి చేస్తున్నారు. ఆమె పలు ప్రత్యేక కార్యక్రమాలు, షోస్ లో కనిపిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించుకున్న సదాను బుల్లితెరపై చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రానున్న రోజుల‌లో సదా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేలా క‌నిపిస్తుంది.

Advertisement
Advertisement