Home » Entertainment » Sai Dharam Tej New Movie Title
Entertainment

Sai Dharam Tej : మామ గుడుంబా శంకర్.. అల్లుడు గంజాయి శంకర్ .. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా పేరు ఇదే..!

Authored By
aruna
The Telugu News | Published on: October 11, 2023, 10:00 am
Advertisement

Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘ పిల్లా నువ్వు లేని జీవితం ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు. తొలి సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో తర్వాత వరుస సినిమాలు చేస్తూ సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే రోడ్డు ప్రమాదం కారణంగా ఆయన కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. కోలుకున్న తర్వాత ‘ విరూపాక్ష ‘ సినిమా చేశారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా ఈ సినిమా 100 కోట్ల పైగా వసూళ్లు సాధించింది. ఇక ఆ తర్వాత సాయి ధరంతేజ్ తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ ‘ బ్రో ‘ సినిమాలో నటించారు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎవరేజ్ టాకును సంపాదించుకుంది.

Advertisement

బ్రో సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. సిటీమార్ సినిమాతో హిట్ అందుకున్న సంపత్ నంది సాయి ధరంతేజ్ తో ఈ సినిమాకు కమిట్ అయ్యాడు. జైలు నేపథ్యంలో సాగే ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ లుక్ కొత్తగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మాస్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Sai dharam tej new movie title

Advertisement

అయితే ఈ సినిమా టైటిల్ పై ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకి గంజాయి శంకర్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంపత్ నంది స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవాలి. అయితే సాయి ధరంతేజ్ సినిమాకు గంజాయి శంకర్ సినిమా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సినిమా యూనిట్ చెబుతుంది. అయితే ఈ క్రమంలోనే మామ గుడుంబా శంకర్ అయితే అల్లుడు గంజాయి శంకర్ అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా చేశారు. ఇప్పుడు అదే తరహాలో తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమాకి కూడా గంజాయ్ శంకర్ సినిమా పేరు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి