Sai Dharam Tej Virupaksha Movie : సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడానికి ఈ ఒక్క కారణం చాలు !
Sai Dharam Tej Virupaksha Movie : సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా తర్వాత విరుపాక్ష సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. అయితే ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ క్రమంలోని ఈ సినిమాలో అజయ్ చేసిన పాత్ర లుక్ ని సినిమా యూనిట్ రివీల్ చేశారు. ఈ సినిమాలో అజయ్ కీలకపాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ పాత్ర హైలెట్ కాబోతుందని తెలుస్తుంది. విరూపాక్ష సినిమాలో కథ కథనాలతో పాటు నటీనటుల పర్ఫామెన్స్ కూడా అలరిస్తుందని అంటున్నారు.
ఈ సినిమాలో అజయ్ పాత్ర కీలకం అని అనిపిస్తుంది. మనకు తెలిసిందే అజయ్ ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్గా, విలన్ గా, హీరోయిన్ అన్నగా చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అజయ్ ఈ సినిమాతో తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు. కొన్ని సినిమాలలో చిన్న పాత్ర చేసిన మరికొన్ని సినిమాలలో అజయ్ కీలక పాత్ర చేసి జనాలను మెప్పించాడు. విరూపాక్ష సినిమాతో కూడా అజయ్ ప్రేక్షకులను మెప్పిస్తాడని తెలుస్తుంది. హారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ విరుపాక్ష సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. హారర్ సినిమాలు కొత్తవాళ్లు తక్కువ బడ్జెట్లో చేస్తుంటారు.
కానీ మెగా హీరోతో కొత్త డైరెక్టర్ పెద్ద సాహసమే చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ జనాలలో భారీ అంచనాలు నెలకొల్పాయి. ఇప్పటివరకు హారర్ సినిమాలు ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. ఇప్పుడు వస్తున్నా సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా ప్రమోషన్స్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. మరీ ఈ సినిమా విడుదలై ఎటువంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.