Sai Pallavi : అందరు హీరోయిన్స్ న్యూ ఇయర్ పార్టీలో ఉంటే.. సాయి పల్లవి అక్కడ ప్రత్యక్షమై షాక్ ఇచ్చింది..!

Advertisement

Sai Pallavi : టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆమె చేస్తున్న సినిమాలు.. ప్రత్యేకమైన పాత్రలు ఆమెకు సెపరేట్ క్రేజ్ తెచ్చాయి. ఫిదా నుంచి తెలుగులో సాయి పల్లవి సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చింది. అయితే ఎంత పెద్ద స్టార్ డం వచ్చినా సరే సాయి పల్లవి ఇప్పటికీ చాలా సింప్లిసిటీ మెయిన్ టైన్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎలాంటి హంగు ఆర్భాటాలకు వెళ్లదు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా తన పర్సనల్ లైఫ్ లో సర్ ప్రైజ్ చేస్తుంది.

Advertisement

ఇక న్యూ ఇయర్ రోజున అందరు పార్టీలు గట్రా అంటూ ఎంజాయ్ చేస్తుంటే సాయి పల్లవి మరోసారి తన ప్రవర్తనతో షాక్ ఇచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లో పార్టీలు లాంటివి కాకుండ పుట్టపర్త్లో బాబా పూజలో పాల్గొన్నది సాయి పల్లవి. గార్గి తర్వాత నెక్స్ట్ సినిమా ఓకే చేయని సాయి పల్లవి చాలా రోజుల తర్వాత మీడియా కంట పడ్డది. అందులోనూ సత్య సాయి బాబా పూజలో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేసింది. సాయి పల్లవి మరోసారి ఆడియన్స్ మనసులు దోచేసింది.

Advertisement
Sai Pallavi audience at baba puja new year day
Sai Pallavi audience at baba puja new year day

న్యూ ఇయర్ రోజు ఆమె బాబా ఆశ్రమంలో పూజలో ఉండటం అందరిని ఆశ్చర్యపరచింది. చీర కట్టుకుని పూర్తిగా సంప్రదాయ బద్ధంగా సాయి పల్లవి పూజలో పాల్గొన్నది. సాయి పల్లవి సినిమాలతోనే కాదు ఇలాంటి పనుల వల్ల కూడా తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. తన సింప్లిసిటీతోనే సాయి పల్లవి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. సాయి పల్లవి నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి ని ఈమధ్య తెలుగులో లేడీ పవర్ స్టార్ అనేస్తున్నారు. విరాటపర్వం, గార్గి సినిమాలతో లాస్ట్ ఇయర్ మరోసారి తన నటనతో మెప్పించింది సాయి పల్లవి.

Advertisement
Advertisement